సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రస్తుతం కశ్మీర్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా నుంచి నటుడు జగపతిబాబు తప్పుకున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటన్నింటిపై ఈ రోజు స్పష్టతనిస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి, నటుడు జగపతిబాబు ట్వీట్స్ చేశారు.
"‘సరిలేరు నీకెవ్వరు’లో నటించడానికి జగపతిబాబు చాలా ఆసక్తి చూపారు. తన పాత్రను ఇష్టపడ్డారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇందులో నటించడం లేదు. కానీ భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నా. ఈ విషయంలో మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు" -అనిల్ రావిపూడి, దర్శకుడు
"నేను సినీ ఇండస్ట్రీలో 33 ఏళ్లుగా ఉన్నా. ఇలా ఎప్పుడూ వివరణ ఇవ్వాల్సిన అవసరం రాలేదు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా నుంచి నేను తప్పుకున్నానని చాలా పుకార్లు వచ్చాయి. కానీ అది నిజం కాదు. ఇప్పటికీ ఆ పాత్రంటే నాకిష్టం. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అందులో నటించడం లేదు. చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్."
-జగపతిబాబు, నటుడు
-
Here's the clarification to all regarding #SarileruNeekevvaru issue.https://t.co/0f9DaenaKo pic.twitter.com/rpyAKRVzdu
— Jaggu Bhai (@IamJagguBhai) July 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Here's the clarification to all regarding #SarileruNeekevvaru issue.https://t.co/0f9DaenaKo pic.twitter.com/rpyAKRVzdu
— Jaggu Bhai (@IamJagguBhai) July 19, 2019Here's the clarification to all regarding #SarileruNeekevvaru issue.https://t.co/0f9DaenaKo pic.twitter.com/rpyAKRVzdu
— Jaggu Bhai (@IamJagguBhai) July 19, 2019
ఈ సినిమాలో మహేశ్‌బాబు ఆర్మీ మేజర్‌గా కనిపించనున్నాడు. రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. దాదాపు 13 ఏళ్ల విరామం తర్వాత విజయశాంతి ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. దిల్‌రాజుతో కలిసి అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల్ని పలకరించనుందీ చిత్రం.
ఇది చదవండి: ఆర్మీ అధికారిగా మహేశ్... ఫస్ట్ లుక్ లీక్