ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఎప్పుడూ సందడి చేసే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించింది. తన కుటుంబం, మెుదటిసారి చేసిన ర్యాంప్ వాక్, ఆడిషన్స్, మిస్ శ్రీలంక అవ్వటం వంటి విషయాలు ఇందులో చెప్పింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
'కెమెరాతో నాకు ప్రత్యేక బంధం ఉంది, కనిపిస్తే చిన్నపిల్లలా మారిపోతా. 21 సంవత్సరాలకు మిస్ యూనివర్స్ ఛాన్స్ వచ్చింది. కానీ విజయం సాధించలేకపోయా. ఈ పరాజయం ఏదో తెలియని విశ్వాసాన్ని ఇచ్చి ముంబయి రప్పించింది. నా సినీప్రయాణం ఎత్తుపల్లాలుగా సాగింది. జీవితమంతా కెమెరా చుట్టూనే తిరిగినా. ఈ ఛానెల్ మాత్రం ప్రత్యేకం' -జాక్వెలిన్ ఫెర్నాండెజ్, బాలీవుడ్ నటి
వీటితో పాటే ఫ్యాషన్, ట్రావెల్, ఫిట్నెస్కి సంబంధించిన వీడియోలు షేర్ చేసింది. మెుత్తం సినీ ప్రయాణాన్ని తెలిపింది. మొదలుపెట్టిన వెంటనే 8000 మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ఇప్పటికే జాక్వెలిన్‌ను ఇన్‌స్టా, ట్విట్టర్లో 30 మిలియన్ల అభిమానులు అనుసరిస్తున్నారు.
ఇది చదవండి: బన్నీ సినిమా సెట్లో అడుగుపెట్టిన టబు