ప్రస్తుతం ప్రపంచమంతా యాప్‌లతో నడుస్తుంది. కొంతమందికి ఇవి సరదానిస్తే, మరి కొంతమందికి రాత్రికి రాత్రే సెలబ్రిటీ హోదాను తెచ్చిపెట్టాయి. అలా టిక్‌టాక్ వీడియోల్లో కనిపించి 2019 'టిక్‌టాక్ ఇండియా క్వీన్'గా అవతరించింది బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. 'సాహో'లో 'బ్యాడ్ బాయ్' అంటూ సాగే ప్రత్యేక గీతంలో ప్రభాస్ సరసన చిందులేసిందీ భామ.
తాజాగా టిక్‌టాక్ రివైండ్ 2019 ప్రచారంలో భాగంగా మొదటి యాభై కంటెంట్ వీడియోల జాబితా విడుదల చేసింది. అత్యధిక ఫాలోవర్స్‌ను కలిగిన బాలీవుడ్ నటిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ టాప్‌లో నిలిచింది. '2019 ఇండియా టిక్‌టాక్ క్వీన్'గా అవతరించింది.
జాక్వెలిన్.. 9.5 మిలియన్ల ఫాలోవర్లతో బాలీవుడ్లో అగ్రస్థానంలో... ఆ తరువాత రితేశ్ దేశ్‌ముఖ్ 6.8 మిలియన్లు, కపిల్ శర్మ 2.2 మిలియ్న్లు, మాధురీ దీక్షిత్ 1.2 మిలియన్ల అనుచరులును కలిగి ఉన్నారు. జాక్వెలిన్.. హాట్ హాట్ బికినీలతోనే కాదు టిక్‌టాక్‌లోనూ తనదైన శైలిలో అలరించి, అభిమానులను సంపాదించుకుంది.
ఇది చదవండి: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కొత్త యూట్యూబ్ ఛానెల్