ETV Bharat / sitara

ఎంగేజ్​మెంట్​ పూర్తి.. నెక్ట్స్​ పెళ్లే అంటున్న నయన్​ - నయన్‌

తన చేతికి ఉన్న ఉంగరం గురించి హీరోయిన్ నయనతార క్లారిటీ ఇచ్చింది. అది ఎంగేజ్​మెంట్​ రింగేనని వెల్లడించింది.

Nayanthara
నయనతార​
author img

By

Published : Aug 11, 2021, 5:31 AM IST

స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ గత కొన్నేళ్లుగా ప్రేమాయణం నడుపుతున్నారని మనకు తెలుగు. నయన్‌పై తనకున్న ప్రేమను విఘ్నేశ్‌ పలు సందర్భాల్లో సోషల్‌మీడియా వేదికగా తెలియజేశారు. నయన్‌ వేలికి ఉంగరం, విఘ్నేశ్ షేర్‌ చేసిన చాలా ఫొటోల్లో కనిపించింది. దీంతో ఈ జంటకు నిశ్చితార్థమైందా?లేదా? అన్న చర్చ అప్పటినుంచే మొదలైంది. ఇప్పుడదే విషయంపై స్పష్టతనిచ్చింది నయన్​.

చెప్పేసింది!

ఇటీవల ఓ తమిళ టీవీషోలో పాల్గొన్న నయన్.. యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తన చేతికి ఉన్నది ఎంగేజ్​మెంట్ ఉంగరమేనని చెప్పేసింది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విఘ్నేష్​.. తానూ, నయన్ పెళ్లికి రెడీ అవుతున్నామని, అందుకోసం డబ్బు సమకూరుస్తున్నామని చెప్పారు.

ఒకానొక సమయంలో ప్రేమలో విఫలమైన నయన్‌కు 2015లో విడుదలైన 'నేను రౌడీ నే' చిత్రం సమయంలో విఘ్నేశ్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం వీరి పరిచయం ప్రేమకు దారితీసింది.

నయనతార నటించిన 'నేత్రికన్‌' సినిమా.. ఆగస్టు 13న ఓటీటీలో విడుదల కానుంది. మిలింద్‌ రావు దర్శకత్వం వహించారు. విఘ్నేష్ ప్రస్తుతం.. వాకుల రెండు కాదల్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విజయ్​ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇదీ చదవండి: 'ఎన్టీఆర్​తో ఒక్క సీన్​ అయినా చేస్తే చాలు!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.