బాలీవుడ్లో తెరకెక్కుతోన్న 'బెల్‌బాటమ్' చిత్రంలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన నటించడం తనకు ఓ గొప్ప అవకాశమని తెలిపింది హీరోయిన్ వాణీ కపూర్. ఆగస్టులో పునఃప్రారంభంకానున్న ఈ సినిమా చిత్రీకరణ కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది.
అక్షయ్‌తో కలిసి పనిచేసేందుకు చాలా ఆత్రుతగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది వాణి. ఆయనకు తాను వీరాభిమాని అని, ఈ సినిమాలో నటించడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పింది. దీంతోపాటు ఈ చిత్రంలోని తన పాత్ర ఎంతో కీలకమైనదని.. తప్పకుండా అభిమానులకు ఓ కొత్త అనుభూతినిస్తుందని వెల్లడించింది.
కన్నడ 'బెల్‌బాటమ్'కు రీమేక్
గతేడాది వచ్చిన కన్నడ 'బెల్‌బాటమ్'కు రీమేక్ ఈ సినిమా. మాతృకలో రిషభ్‌శెట్టి, హరిప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. 1980లో జరిగిన నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో కథానాయకుడు అక్షయ్ డిటెక్టివ్‌గా కనిపించనున్నాడు. రీమేక్‌కు సంబంధించిన షూటింగ్ ఆగస్టులో లండన్‌లో తిరిగి ప్రారంభం కానుంది.
ఈ చిత్రానికి రంజిత్ తివారీ దర్శకత్వం వహిస్తున్నాడు. తొలిసారిగా అక్షయ్-వాణీ కపూర్ కలిసి ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 2న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది.
ఇది చూడండి : ఐశ్వర్య రాయ్‌తో పాటు ఆమె కుమార్తెకు కరోనా