యువ కథానాయకుడు సందీప్ కిషన్ వెండితెరకు పరిచయమై 11 ఏళ్లు పూర్తయింది. ఆయన నటించిన తొలి చిత్రం 'ప్రస్థానం' 2010 ఏప్రిల్ 16న విడుదలైంది. ఇందులో చిన్నా అనే పాత్ర పోషించి తొలి ప్రయత్నంలోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సాయి కుమార్, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో దేవ కట్టా తెరకెక్కించిన చిత్రమది. రాజకీయ నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా రూపొందిన ఆ సినిమాలో సాయి కుమార్ తనయుడిగా కనిపించి ఆకట్టుకున్నాడు.
ఆ తర్వాత 'స్నేహ గీతం', 'రొటీన్ లవ్ స్టోరీ', 'గుండెల్లో గోదారి' వంటి విభిన్న కథలు ఎంపిక చేసుకుని తనదైన ముద్ర వేశాడు. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్నాడు. లవ్ స్టోరీలు చేస్తూనే కథాబలం ఉన్న చిత్రాల్లో నటించి తనను తాను నిరూపించుకున్నాడు. నిర్మాతగానూ విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న 'గల్లీ రౌడీ' చిత్రంలో నటిస్తున్నాడు. నేహా శెట్టి కథానాయిక. ఏప్రిల్ 19న విజయ్ దేవరకొండ ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయనున్నారు.
ఇదీ చదవండి: 'సెహరి' టీజర్.. 'జాతిరత్నాలు' వీడియో సాంగ్