రామ్ హీరోగా నటించిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్ర ట్రైలర్ విడుదలైంది. పక్కా హైదరాబాదీగా కనిపించిన రామ్ పలికిన డైలాగ్స్ ఆకర్షిస్తున్నాయి. పూరీజగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, నబా నటేష్ హీరోయిన్లు. జులై 18న విడుదల కానుందీ చిత్రం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"నా దిమాక్ ఏంది రా.. డబుల్ సిమ్ కార్డు ఫోన్ లెక్క ఉంది" అంటూ రామ్ చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. "కాలీ పీలీ లొల్లొద్దు.. చుప్ చాప్ ఇంటికి పోండ్రి" అంటూ అచ్చమైన హైదరాబాదీగా పలకరించాడు. "ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్.." అంటూ చివర్లో అలరించాడు.
ఇప్పటికే విడుదలైన సినిమాలోని పాటలు శ్రోతల్ని అలరిస్తున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో చిత్రంపై అంచనాలు పెంచేసింది చిత్రబృందం. పూరీజగన్నాథ్, చార్మి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూర్చాడు.
ఇది చదవండి: ఓ హత్య.. ఇద్దరు నిందితులు.. చేసిందెవరు?