ETV Bharat / sitara

ఐశ్వర్య కోసం షెడ్యూల్‌ సిద్ధం చేస్తోన్న మణిరత్నం! - ఐశ్వర్యరాయ్‌ కాల్​ షీట్స్​ ఎక్కువ తీసుకున్న మణిరత్నం

లాక్​డౌన్​ తర్వాత 'పొన్నియన్​ సెల్వన్' చిత్రీకరణ కోసం ఐశ్వర్యా రాయ్​ కాల్​ షీట్లను అధిక మొత్తంలో తీసుకున్నారట దర్శకుడు మణిరత్నం. ఈ సినిమాలో విక్రమ్​, కార్తి, త్రిష వంటి భారీ తారాగణం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Aishwarya Rai Bachchan
ఐశ్వర్యరాయ్‌
author img

By

Published : May 29, 2020, 5:35 AM IST

ప్రముఖ దర్శకుడు మణిరత్నం పత్రిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'పొన్నియన్‌ సెల్వన్'‌. గతేడాది డిసెంబర్‌లో థాయ్‌లాండ్​‌లో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఆ తర్వాత రెండో షెడ్యూల్‌ పుదుచ్చేరిలో ఫిబ్రవరి 3 నుంచి ఆరు రోజుల పాటు చిత్రీకరణ ప్రారంభించారు. అనంతరం లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. అయితే తాజాగా దర్శకుడు మణిరత్నం.. ఐశ్వర్యా రాయ్‌, విక్రమ్‌ల కాల్‌షీట్లను ఎక్కువ మొత్తం తీసుకొని పుదుచ్చేరిలో షూటింగ్‌ ప్రారంభించడానికి సమాయత్తం అవుతున్నట్లు టాక్​.

ప్రస్తుతం లాక్‌డౌన్‌ పూర్తయినా అవుట్‌ డోర్‌ షూటింగ్‌ అంటే అనుమతులు ఇస్తారో లేదో తెలియదు. ఈ పరిస్థితులన్నీ గమనించిన చిత్రబృందం చైన్నైలోనే వీరిద్దరితో ఇండోర్‌ షూటింగ్‌ చేయాలని భావిస్తుందట. అందుకోసం సినిమా చిత్రీకరణ పునఃప్రారంభంకాగానే ఐష్​-విక్రమ్​ సన్నివేశాలు త్వరగా పూర్తిచేయాలని వారి కాల్​షీట్లను ఎక్కువగా తీసుకున్నట్లు తెలుస్తోంది.

కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా తెరకెక్కుతున్న 'పొన్నియన్‌ సెల్వన్'‌ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్‌ టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో జయం రవి, కార్తి, విక్రమ్‌ ప్రభు, త్రిష, శోభిత దూలిపాళ్ల, శరత్‌ కుమార్‌, అదితిరావు హైదరి తదితరులు నటిస్తున్నారు. సుహాసిని మణిరత్నం, అలీరాజా సుబకరన్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, ఏ.ఆర్.రెహమాన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇదీ చూడండి : నెట్టింట వైరల్​గా సూర్య 'బందోబస్త్​' వీడియోలు

For All Latest Updates

TAGGED:

ishwarya
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.