ETV Bharat / sitara

వెబ్​ సిరీస్​ల్లో నటించేందుకు మెగాస్టార్ సిద్ధం - cinema news

వెండితెరపై మెప్పిస్తున్న అగ్ర కథానాయకుడు చిరంజీవి.. నెటిజన్లను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. వెబ్​సిరీస్​ల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

Is Chirnajeevi ready to act in Webseries!
వెబ్​సిరీస్​లోకి చిరంజీవి అరంగేట్రం!
author img

By

Published : Apr 22, 2020, 3:32 PM IST

మెగాస్టార్ చిరంజీవి.. వెండితెరపైనే కాకుండా వెబ్​సిరీస్​ల్లోనూ నటించేందుకు సిద్ధమవుతున్నారు. అవును మీరు విన్నది నిజమే. లాక్​డౌన్ వల్ల ఇంట్లనే ఉన్న ఆయన.. ఇటీవలే ఓ వీడియో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అవకాశమొస్తే కచ్చితంగా నటిస్తానని, ప్రస్తుతం మాత్రం వేరే పనుల్లో బిజీగా ఉన్నానని అన్నారు.

టాలీవుడ్​ నటీనటుల్లో సమంత... ఇప్పటికే ఈ బాటలో నడిచింది. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'లో కీలకపాత్ర పోషించింది. త్వరలో ఈ సీజన్, ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం చిరంజీవి.. 'ఆచార్య'లో నటిస్తున్నారు. లాక్​డౌన్ వల్ల చిత్రీకరణ నిలిచిపోయింది. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్. మణిశర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కొరటాల శివ దర్శకుడు. అయితే ఇందులో రామ్‌చరణ్‌.. ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడనే వార్త అభిమానుల్లో అంచనాల్ని పెంచుతోంది.

ఇదీ చూడండి.. 'రియల్ మెన్' అనిపించుకున్న చరణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.