ETV Bharat / sitara

అచ్చొచ్చిన దర్శకుడితో బాలకృష్ణ మరోసారి! - balakrishna upcoming movie news

కథానాయకుడు బాలకృష్ణ.. తనతో ఇంతకుముందు పనిచేసిన దర్శకుడితోనే మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ విషయమై ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

Is Balakrishna next film in B.Gopal Direction
అచ్చొచ్చిన దర్శకుడితో... బాలయ్య మరోసారి
author img

By

Published : Apr 14, 2020, 5:08 PM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బి.గోపాల్‌ కాంబినేషన్​లో గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వాటికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో అభిమానుల్ని అలరించేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కథ సిద్ధం చేసిన గోపాల్.. ప్రముఖ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌కు స్క్రిప్టు బాధ్యతను అప్పజెప్పారని సమాచారం. స్క్రిప్టును బాలయ్యకు వినిపించడమే మిగిలి ఉందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

'రూలర్‌' తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి మూడోసారి పనిచేస్తున్నాడు బాలకృష్ణ. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమై తొలి షెడ్యూల్​ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కరోనా కారణంగా చిత్రీకరణను నిలిపివేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన అనంతరం బి.గోపాల్‌ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందట.

వీరిద్దరి కలిసి ఇంతకు ముందు 'లారీడైవ్రర్‌', 'సమర సింహారెడ్డి', 'నర సింహనాయుడు' లాంటి హిట్ చిత్రాలు తీశారు. అదేవిధంగా బాలకృష్ణ నటించిన చారిత్రక చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'కి బుర్రా సాయిమాధవ్‌ మాటలు రాశారు.

Is Balakrishna next film in B.Gopal Direction
దర్శకుడు బి.గోపాల్​

ఇదీ చూడండి : పవన్​-క్రిష్​ సినిమా కథ చెప్పేసిన మెగా బ్రదర్​​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.