ETV Bharat / sitara

తెలుగు చిత్రపరిశ్రమలో కొత్త అందాల సవ్వడి - Varsha Bollamma

చిత్రసీమ ఎప్పుడూ కొత్తదనం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కొత్త కథలు, కొత్త నేపథ్యాలు, కొత్త లుక్‌లు.. ఇలా అంతటా కొత్తదనం కనిపించాల్సిందే. అందులో భాగమే కొత్త హీరోయిన్‌ కూడా! అందుకే కథానాయికలు ఎంత మంది ఉన్నా.. కొత్తగా మరొకరికి చోటు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది తెలుగు చిత్రసీమ. ఈ ఏడాదీ మన తెరపై కొత్తందాలు బలంగా మెరిసే అవకాశాలు కనిపించాయి. ఆరంభంలోనే పలువురు కొత్త నాయికలు పరిశ్రమలో సందడి చేశారు. తెరపై వాళ్ల హంగామా మొదలవుతుందనగానే కరోనా విజృంభించింది. ఈ ఆర్నెళ్లలో పలువురు కొత్త నాయికలు చోటు సంపాదించుకున్నారు.

Introduces of new Heroines to Tollywood Industry
తెలుగు చిత్రపరిశ్రమలో కొత్త అందాల సవ్వడి
author img

By

Published : Jul 2, 2020, 7:21 AM IST

అనుష్క, కాజల్‌, తమన్నా, శ్రుతిహాసన్‌ తదితర సీనియర్‌ నాయికలు ఇంకా జోరుమీద ఉన్నారు. సమంత, ప్రియమణి, శ్రియ తదితర భామలు పెళ్లి తర్వాతా వరుస అవకాశాలతో అదరగొడుతున్నారు. రష్మిక, పూజా హెగ్డే, కీర్తి సురేష్‌, సాయి పల్లవి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రాశీ ఖన్నా స్టార్లుగా హవా చూపుతున్నారు. నివేదా థామస్‌, అనుపమ పరమేశ్వరన్, నివేదా పేతురాజ్‌, నిధి అగర్వాల్‌, నభా నటేష్‌.. ఇలా నవతరం హీరోలకి తగ్గ భామలూ బోలెడంతమంది ఉన్నారు. అయినా సరే... ఈ ఏడాది కొత్తందాలకి ఎర్రతివాచీ పరిచేసింది తెలుగు చిత్రసీమ. అమృత అయ్యర్‌, కేతికాశర్మ, ప్రియా భవాని శంకర్‌, కృతిశెట్టి, వర్ష బొల్లమ్మ... ఇలా పలువురు అవకాశాల్ని దక్కించుకున్నారు. వరుణ్‌తేజ్‌ చిత్రం కోసం బాలీవుడ్‌ నుంచి సయీ మంజ్రేకర్‌ వచ్చింది. బాలకృష్ణ - బోయపాటి కలయికలో రానున్న చిత్రం కోసం ఓ కొత్తందం దిగుమతి కాబోతోంది.

Introduces of new Heroines to Tollywood Industry
కృతి శెట్టి

సయీ మంజ్రేకర్​

సినిమా విడుదలకు ముందే...

తొలి అవకాశం విషయంలో అదృష్టం ముఖ్య పాత్ర పోషిస్తుందేమో కానీ... మలి అవకాశానికి మాత్రం విజయమే ప్రాతిపదిక అంటుంటాయి సినీ వర్గాలు. అయితే కొంతమంది కథానాయికల అందం.. విజయాలతో సంబంధం లేకుండా ఆకర్షిస్తుంటుంది. దాంతో చాలామంది ఫలితాలతో సంబంధం లేకుండా కొంతకాలం మెరుస్తుంటారు. కానీ తొలి సినిమా విడుదల కాకమునుపే, మరో కొత్త అవకాశం అందుకుంటున్నారు నాయికలు. అందులో అమృత అయ్యర్‌ ఒకరు. ఆమె అనువాద చిత్రం 'విజిల్‌'తో మెరిసింది. అందులో చేసింది చిన్న పాత్రే అయినా..ఆమె అందం తెలుగు పరిశ్రమని ఆకట్టుకుంది. దాంతో వరుసగా అవకాశాలు వెల్లువెత్తాయి. '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' చిత్రంలో నటించిందామె. రామ్‌ చిత్రం 'రెడ్‌'లోనూ ముఖ్య పాత్ర పోషించింది. ఇటీవల నాగశౌర్యకి జోడీగా మరో చిత్రం కోసం ఎంపికైనట్టు సమాచారం.

అమృత అయ్యర్​

పూరి కాంపౌడ్​లో కొత్త అందం

పూరి జగన్నాథ్‌ కాంపౌండ్‌ కొత్త భామలకి కేరాఫ్‌ అడ్రస్‌. ఆయన ఎంతోమంది నాయికల్ని పరిచయం చేశారు. ఈ ఏడాది బాలీవుడ్‌ భామ అనన్య పాండేని 'ఫైటర్‌'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. ఆయన కాంపౌండ్‌ నుంచి వస్తున్న మరో నాయిక కేతికా శర్మ. పూరి తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న 'రొమాంటిక్‌'తో పరిచయమవుతోంది. ఈ సినిమా ఇంకా విడుదల కాకపోయినప్పటికీ ప్రచార చిత్రాల్లో ఆమె అందం తెలుగు పరిశ్రమని ఆకట్టుకుంది. దాంతో ఇప్పటికే ఆమెకి మరో అవకాశం అందినట్టు సమాచారం. సుకుమార్‌ నిర్మించబోయే ఓ సినిమాలో నాగశౌర్య సరసన కేతికా ఎంపికైనట్టు తెలిసింది. మనోజ్‌ 'అహం బ్రహ్మాస్మి'తో తమిళమ్మాయి ప్రియ భవాని శంకర్‌ తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. తమిళంలో పలు చిత్రాల్లో మెరిసిన ఆమెపై కూడా చిత్రసీమ దృష్టిసారించింది.

ప్రియా భవాని శంకర్​

అనన్య పాండే

కేతికా శర్మ

ధక్‌ ధక్‌ ధక్‌

మంగళూరు ముద్దుగుమ్మలకి తెలుగు చిత్రసీమ బాగా అచ్చొచ్చింది. అనుష్క మొదలు ఎంతోమంది అక్కడి నుంచి వచ్చినవాళ్లే. 'ఉప్పెన'తో పరిచయమవుతున్న కృతిశెట్టి అక్కడి నుంచే వచ్చింది. ఆమె అందం ప్రచార చిత్రాలతోనే 'ధక్‌ ధక్‌ ధక్‌' అనిపించింది. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటించిన చిత్రమిది. దీంతోపాటు కృతిశెట్టి నిఖిల్‌ సరసన '18 పేజెస్‌'లో నటించబోతున్నట్టు సమాచారం. 'విజిల్‌'తో మెరిసిన వర్ష బొల్లమ్మ తెలుగులో 'చూసీ చూడంగానే' చిత్రంతో అదృష్టాన్ని పరీక్షించుకుంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండకి జోడీగా ఓ చిత్రంలో నటిస్తోంది వర్ష.

వర్ష బొల్లమ్మ

ఇదీ చూడండి... రైతు పాత్రలో నందమూరి బాలకృష్ణ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.