ETV Bharat / sitara

బేర్​గ్రిల్స్​తో సాహసాలకు మరో స్టార్​ హీరో రెడీ - విక్కీ కౌశల్​

మన దేశానికి చెందిన ప్రముఖులు ప్రధాని మోదీ(bear grylls modi episode), రజనీకాంత్, అక్షయ్ కుమార్​, అజయ్​దేవగణ్​లతో సాహసాలు చేయించిన సాహసికుడు బేర్ గ్రిల్స్​.. ఈసారి మరో బాలీవుడ్​ హీరో విక్కీ కౌశల్​తో(bear grylls vicky kaushal) స్టంట్​లు చేయించనున్నారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ నవంబరు 12న ప్రసారం కానుంది. ​

baregylls
బేర్​ గిల్స్​
author img

By

Published : Nov 8, 2021, 2:25 PM IST

ప్రముఖ మనుగడ పోరాటాల వీరుడు బేర్ గ్రిల్స్(bear grylls vicky kaushal).. మరో స్టార్​ హీరోతో కలిసి అడ్వెంచర్​ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 'ఇన్​టూ ది వైల్డ్'(Into the wild Bear grylls) కార్యక్రమం కొత్త ఎపిసోడ్​లో బాలీవుడ్​ హీరో విక్కీ కౌశల్​తో స్టంట్​లు చేయించనున్నారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్​ నవంబరు 12న డిస్కవరీ ప్లస్​లో ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్​ పోస్టర్​ను విక్కీ ఇన్​స్టాలో పోస్ట్​ చేశారు(vicky kaushal latest news).

అడవిలో సాహసాలు చేస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బ్రిటీష్ సాహసికుడు బేర్ గ్రిల్స్.. ఇప్పటివరకు భారత్​ సెలబ్రిటీలలో ప్రధాని మోదీ(narendra modi), సూపర్​స్టార్ రజనీకాంత్(beat gylls rajnikanth), అక్షయ్​ కుమార్​, అజయ్​దేవగణ్​లతో కలిసి 'ఇన్​టూ ది వైల్డ్' ఎపిసోడ్స్ చేశారు. ఇప్పుడు విక్కీతో కలిసి పనిచేయనున్నారు.

విక్కీ కౌశల్​ ఇటీవలే 'సర్దార్​ ఉద్ధమ్'​(sardar uddham movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం 'సామ్​ బహదూర్​', 'ది గ్రేట్​ ఇండియన్​ ఫ్యామిలీ', 'మిస్టర్​ లేలే' సినిమాల్లో నటిస్తున్నారు. కాగా, విక్కీ.. హీరోయిన్​ కత్రినా కైఫ్​ను(vicky kaushal katrina kaif wedding) డిసెంబరులో వివాహం చేసుకోనున్నారని ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే వీరిద్దరు దీపావళి రోజున రహస్యంగా 'రోకా' ఫంక్షన్​ చేసుకున్నట్లు తెలిసింది.

ఇదీ చూడండి: రహస్యంగా విక్కీ-కత్రినా కైఫ్​ రోకా వేడుక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.