ETV Bharat / sitara

ఆ చిత్రం కోసం ఒకే డ్రెస్‌ రెండేళ్లు వేసుకున్న చిరు! - కోడి రామకృష్ణ అంజి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అంజి'. అద్భుత గ్రాఫిక్స్​తో తెరకెక్కిన ఈ సినిమా విజువల్ వండర్​గా ప్రేక్షకుల్ని అలరించింది. అయితే ఈ మూవీ షూటింగ్ కోసం చిరు ఒకే డ్రెస్​ను రెండేళ్ల పాటు వేసుకున్నారట.

Interesting facts about Chiranjeevi Anji movie
ఆ చిత్రం కోసం ఒకే డ్రెస్‌ రెండేళ్లు వేసుకున్న చిరు!
author img

By

Published : Feb 10, 2021, 9:39 PM IST

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోషియో ఫాంటసీ ఫిల్మ్‌ 'అంజి'. భారీ అంచనాల మధ్య 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. అప్పట్లో హాలీవుడ్‌ సినిమాను తలపించేలా గ్రాఫిక్స్‌తో ఈ మూవీని తీర్చిదిద్దారు. దాదాపు ఐదేళ్లకు పైగా షూటింగ్‌ జరుపుకుందీ చిత్రం. కాగా, ఇందులో విరామ సన్నివేశాలను నెలరోజుల పాటు తీసినట్లు దర్శకుడు కోడి రామకృష్ణ ఓ సందర్భంలో చెప్పారు.

Kodi Ramakrishna
కోడి రామకృష్ణ

"గ్రాఫిక్స్‌ కోసం చిరంజీవి డ్రెస్‌కు మార్కులు పెట్టేవాళ్లం. ఆయన రోజూ అదే డ్రెస్‌ వేసుకునే వాళ్లు. కనీసం ఉతకడానికి కూడా ఉండేది కాదు. అలా రెండేళ్లు అదే కాస్ట్యూమ్‌ను కొనసాగించాం. 'అంజి' సినిమా ఎప్పుడు టీవీలో చూసినా అద్భుతంగా అనిపిస్తుంది. భారీ అంచనాలతో వెళ్లి చూస్తే, అంతగా ఆకట్టుకున్నట్లు అనిపించకపోవచ్చు. కానీ, చూడగా, చూడగా చరిత్రలో నిలిచిపోయింది. దీనికి క్రెడిట్‌ ఇవ్వాలంటే అది నిర్మాత శ్యామ్ గారికి. ఆ తర్వాత చిరంజీవి గారికి దక్కుతుంది" అని కోడి రామకృష్ణ తెలిపారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.