ETV Bharat / sitara

సుకుమార్ సినిమాలో 'రొమాంటిక్​' భామ - అప్​డేట్స్

హీరోయిన్​ కేతిక శర్మ.. టాలీవుడ్​లో మరో అవకాశాన్ని పట్టేసింది. సుకుమార్ నిర్మిస్తున్న ఓ సినిమాలో కథానాయికగా ఎంపికైందని ప్రచారం సాగుతోంది.

Insta beauty Ketika Sharma got heroine chance in Sukumar's Production
'రొమాంటిక్​' బ్యూటీకి మరో అవకాశం
author img

By

Published : Mar 16, 2020, 3:29 PM IST

ఇన్​స్టాగ్రామ్​ బ్యూటీ కేతిక శర్మ.. టాలీవుడ్​కు 'రొమాంటిక్' సినిమాతో హీరోయిన్​గా పరిచయమవుతోంది. పూరీ జగన్నాథ్ కథనందిస్తుండగా, అతడి కుమారుడు ఆకాశ్ హీరోగా నటిస్తున్నాడు. వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తొలి చిత్రం ఇంకా థియేటర్లలోకి రాకముందే మరో క్రేజీ ప్రాజెక్టులో అవకాశం కొట్టేసిందని టాక్.​

Insta beauty Ketika Sharma got heroine chance in Sukumar's Production
కేతిక శర్మ

దర్శకుడు సుకుమార్​, శరత్​ మరార్​ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో నాగశౌర్య హీరోగా నటించనున్నాడు. సుక్కూ శిష్యుడు కాశీ విశాల్​ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇందులో నటించేందుకు కేతికను ఎంపిక చేసుకున్నారట. ఈ విషయంపై అధికార ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇదీ చూడండి.. కరోనా కాదు కదా ఏమొచ్చినా నా పెళ్లి ఆగదు: నిఖిల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.