టాలీవుడ్ యువహీరో సుశాంత్ కొత్త సినిమా 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాలోని 'పద్మవ్యూహం' పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రంతో దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్. ఏ1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నితిన్ హీరోగా నటించిన 'రంగ్ దే' సినిమాలోని 'బతుకే బస్టాండ్' సాంగ్ విడుదలైంది. కీర్తి సురేశ్ కథానాయిక. ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
శ్రీ విష్ణు హీరోగా నటించిన 'గాలి సంపత్' ట్రైలర్ను విడుదల చేశారు దర్శకుడు రాజమౌళి. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. మార్చి 11న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: ఆకట్టుకునే అందం 'యాషిక' సొంతం