ETV Bharat / sitara

జపాన్​ సింగర్​ హిందీ పాట పాడితే! - indo japan song

జపాన్​కు చెందిన ఓ సింగర్​ హిందీ నేర్చుకుని మరీ పాట పాడి అలరించింది. ఇండో- జపాన్​ సంగీత స్వరకర్తల ద్వయంలో ఈ వీడియో సాంగ్​ రూపొందింది.

indo japan music
ఇండో జపాన్ మ్యూజిక్​
author img

By

Published : Sep 14, 2020, 8:41 PM IST

కొందరు హిందీ గాయకులు తెలుగుతో పాటు మిగతా భాషల్లో పాటలు పాడటం చూశాం. అలాగే కొందరు దక్షిణాది సింగర్స్​ బాలీవుడ్​లో తమ గాత్రాన్ని వినిపించారు. కానీ ఓ జపాన్​ గాయని హిందీ సాంగ్ పాడితే ఎలా ఉంటుంది! ఇదే ఆలోచనకు కార్యరూపం దాల్చారు మురళి, ఆయన స్నేహితుడు మాకిన్. మురళి చెన్నైకి చెందిన స్వరకర్త కాగా, మాకిన్ జపాన్​లో మ్యూజిక్ కంపోజర్. వీరిద్దరూ కలిసి జపాన్​లో 'జియా జియా' అనే పాటను తెరకెక్కించారు. అందుకోసం ఓ సింగర్​కు హిందీ ఉచ్ఛరణపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

"మాకిన్​ నా స్నేహితుడు. అతడిని కలిసేందుకు అప్పుడప్పుడు టోక్యో వెళ్తుంటా. అక్కడ 'బాహుబలి', 'ముత్తు' లాంటి భారతీయ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. ఒకరోజు ఇండో- జపాన్​ మ్యూజిక్​ కంపోజర్స్​తో హిందీ వీడియో సాంగ్​ను నిర్మించాలని మేం అనుకున్నాం. అయితే ఈ పాట అన్నింటి కంటే కాస్త భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో.. జపాన్​ సింగర్​తో హిందీలో పాడిస్తే బాగుంటుందని మాకిన్​తో చెప్పా. అది కష్టమని తెలిసినా.. అక్కడ రెస్టారెంట్ నడిపే ఓ నేపాలీ మహిళ సాయంతో యువ గాయని సయూరిని ఇందుకు ఒప్పించాం. ఆమెకు హిందీ భాషపై శిక్షణ ఇచ్చాం."

-మురళి, సంగీత కారుడు

"ముంబయికి చెందిన రచయిత​ పునీత్​ గురురానీ ఈ పాటను రచించారు. అనంతరం సయూరి గాత్రం, మ్యూజిక్​ ట్రాక్​తో పాటు టోక్యోలో షూటింగ్​ పూర్తి చేసుకుని.. భారత్​లో మిక్స్​ చేసి ఎడిట్​ చేశాం" అని మురళి తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్​ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.