పలానా హీరోయిన్ పెళ్లి అంటే చాలు.. ఎవరు అతడు? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? సినిమా నటుడా లేదంటే ఏ రంగానికి చెందినవాడు? అని అభిమానులు తెగ గుసగుసలాడుకుంటారు. అదే ఆ వ్యక్తి వేరే దేశానికి చెందిన వాడు అయితే ఆ టాపిక్కు అంతే లేకుండా పోతుంది. అలా దేశాంతర వివాహాలు చేసుకున్న హీరోయిన్లు ఎవరు? వారు ఎవర్ని పెళ్లి చేసుకున్నారు?. లాంటి వివరాలు మీకోసం.
ప్రియాంక చోప్రా-నిక్ జోనస్
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా.. తనకంటే దాదాపు పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లాడింది. 2018 డిసెంబరులో జోద్‌పుర్‌లో వీరి వివాహం ఎంతో వేడుకగా జరిగింది. ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
ప్రీతి జింతా-జీన్
తన లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్ జీన్ గుడ్ ఇనఫ్ను 2016లో లాస్ ఏంజెలిస్‌లో వివాహం చేసుకుంది ప్రముఖ నటి ప్రీతి జింతా. తమ ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ, భర్తపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉంటుంది.
శ్రియా శరణ్-ఆండ్రూ కొశ్చివ్
ఎప్పటి నుంచి ప్రేమలో ఉన్న నటి శ్రియ శరణ్.. రష్యాకు చెందిన ఆండ్రూ కొశ్చివ్‌ను 2018లో ముంబయిలో పెళ్లి చేసుకుంది. అనంతరం ఉదయ్పుర్లో ప్రముఖుల కోసం పార్టీ కూడా ఇచ్చారు. భర్తతో ఆనందంగా ఉంటూ, అల్లరి చేస్తూ ఆ ఫొటోలు, వీడియోలను తన ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడూ పోస్ట్ చేస్తూ ఉంటుందీ భామ.
రాధికా ఆప్టే-బెన్డిక్ట్ టేలర్
ప్రముఖ నటి రాధికా ఆప్టే.. బ్రిటన్‌కు చెందిన వయోలినిస్ట్ బెన్డిక్ట్ టేలర్‌ను 2012లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత చాలా సందర్భాల్లో తమ లాంగ్ డిస్టన్స్ పెళ్లిని ఎలా మేనేజ్ చేస్తున్నామో వెల్లడించింది.
సెలీనా జైట్లీ-పీటర్ హాగ్
హీరోయిన్‌గానే కాక ప్రత్యేక గీతాలతోనూ ఆకట్టుకున్న నటి సెలీనా జైట్లీ.. 2011లో ఆస్ట్రియాకు చెందిన పీటర్ హాగ్‌ను వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.