తమిళ అగ్ర నటుడు విజయ్ నివాసంలో ఐటీ అధికారులు గురువారం మరోసారి సోదాలు నిర్వహించారు. గత నెలలోనూ విజయ్ నివాసం, 'బిగిల్' చిత్ర ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో లెక్కచూపని కోట్ల రూపాయల సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో విజయ్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్, ఫైనాన్షియర్ అన్బుచెళియన్ ఇళ్లు, కార్యాలయాలలో ఈ సోదాలు జరిగాయి. రెండు రోజుల క్రితం 'మాస్టర్' సహ దర్శకుడు లలిత్‌కుమార్ నివాసంలోనూ రైడ్ జరిగింది. తాజాగా అధికారులు మరోసారి పణయూర్‌ఇల్లంలోని విజయ్ నివాసానికి వెళ్లి సోదాలు చేస్తున్నారు.
ఇదీ చూడండి : విజయ్ 'బిగిల్' టీమ్‌పై ముగిసిన ఐటీ సోదాలు