కరోనా కట్టడిలో భాగంగా భారత ప్రధాని మోదీ, 21 రోజులు లాక్డౌన్ విధిస్తున్నట్లు ఇటీవలే చెప్పారు. అయినప్పటికీ ప్రజలు బయట తిరుగుతుండటాన్ని సీనియర్ నటుడు మోహన్‌బాబు తప్పుబట్టాడు. పెద్దల మాటలను గౌరవించకపోతే పెను ప్రమాదం తప్పదని హెచ్చరించాడు. మోదీ లాంటి పెద్దల మాటలను ప్రతిఒక్కరూ గౌరవించాలని విజ్ఞప్తి చేశాడు.
వాలీ సుగ్రీవుడు, సీత కథలే నిదర్శనం
ఈ సందర్భంగా ప్రకృతిని, పెద్దల మాటలను విస్మరిస్తే ఎలాంటి వినాశనం జరిగిందో చాలా సంఘటనలు నిదర్శనంగా నిలిచాయని చెప్పాడు మోహన్‌బాబు. ఇందుకోసం వాలీ-సుగ్రీవుడు, సీత కథలను గుర్తుచేస్తూ అవగాహన కల్పించాడు. త్వరలోనే కరోనా నుంచి బయటపడేలా భగవంతున్ని ప్రార్థించాలని ప్రజలను కోరాడు.
ఇదీ చదవండి: కరోనాపై మెగాస్టార్ చిరంజీవి-నాగార్జున పాట