ETV Bharat / sitara

ఆ హీరో 'టవల్' వేలంపాటలో లక్షలు పలికింది! - salman towl at auction

కొన్ని సినిమాలు వచ్చి ఎన్నాళ్లయినా.. అందులోని సన్నివేశాలు, పాత్రలు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. ఆ చిత్రాల్లోని తారలు ధరించిన దుస్తులు, నగలు.. ఇలా కొన్ని వస్తువులు ప్రత్యేకంగా గుర్తుండిపోతాయి. అలా ఫేమస్​ అయిన కొన్నింటిని నిర్మాతలు వేలంవేస్తే, అవి ఊహించని ధరకు అమ్ముడుపోయాయి.

iconic items used in Bollywood films
ఆ హీరో వాడిన తువ్వాలు.. వేలంపాటలో లక్షలు పలికింది!
author img

By

Published : Jun 24, 2020, 12:36 PM IST

ఒక్కసారి కమిట్​ అయితే సినీ అభిమానులు ఎవరి మాట వినరు. అందుకే, తమ అభిమాన తారల సినిమాలు చూడడమే కాదు.. అందులో వాడిన వస్తువులనూ ప్రేమిస్తారు. అలాంటి వాటికి నకిలీలు మార్కెట్లోకొస్తే.. ఎగబడి మరీ సొంతం చేసుకుంటారు. మరి నిజంగా సినిమాల్లో హీరోలు వాడిన వస్తువే వేలానికి పెడితే.. లక్షలు పోసైనా చేజిక్కించుకోరూ? అక్షరాలా అదే చేశారు కొందరు బాలీవుడ్​ ఫ్యాన్స్.​ అలా జరిగిన వేలంలో ఏ వస్తువును ఎంత పెట్టి కొన్నారో తెలుసుకోండి.

1. బాబోయ్​ బ్యాటుకెంత రేటు?

అశుతోష్ గోవారికర్​ తీసిన సినిమా 'లగాన్​'(2000). అయితే ఇందులో హీరోగా నటించిన అమిర్​ ఖాన్..​ చేతితో తయారు చేసిన​ క్రికెట్​ బ్యాటును ఉపయోగించారు.​ దీనిని వేలం వేయగా అక్షరాల రూ. 1,56,000 పెట్టి ఓ అభిమాని కొనుక్కున్నారు.

iconic items used in Bollywood films
అమీర్​ ఖాన్​ వాడిన హ్యండ్​మేడ్​ క్రికెట్​ బ్యాట్​

2. లక్షలు పలికిన టవల్

'ముజ్​సే షాదీ కరోగి' సినిమాలో సల్మాన్​ ఖాన్​ టవల్ స్టెప్​ గుర్తుందా? థియేటర్లలో ఈలలు వేయించిందీ పాట. అయితే అందులో ఉన్న టవల్​ను ఈబే ఆన్​లైన్​ ప్లాట్​ఫాంలో వేలంవేయగా, రూ.100 విలువైన ఈ వస్తువు.. రూ.1.42 లక్షల పలికింది. ఆ డబ్బును ఓ ఎన్జీవోకు విరాళంగా ఇచ్చింది చిత్ర బృందం.

iconic items used in Bollywood films
సల్మాన్​ ఖాన్​ తువ్వాలు స్టెప్​

3. ఫొటోలకూ క్రేజీ క్రేజ్​

బాలీవుడ్​ దిగ్గజ నటుడు​ దేవ్​ ఆనంద్​కు సంబంధించిన 45 బ్లాక్​ అండ్ వైట్​ ఫొటోలు వేలంవేస్తే రూ. 4 లక్షలు ఖర్చు చేసిన అభిమానులు కొనుక్కున్నారు. ఆన్​లైన్​లో వెతికితే కనిపించే ఫొటోలకు లక్షలు పెట్టారేంటని ఆశ్చర్యపోతున్నారా? ఆరు దశాబ్దాల క్రితం తీసిన ఆ ఫొటోల ఒరిజినల్​ కాపీలకు దక్కిన విలువ కట్టలేని అభిమానమది.

iconic items used in Bollywood films
దేవ్​ ఆనంద్​

4. ​చెప్పులకు చెప్పలేనంత డిమాండ్​!

ప్రియాంకా చోప్రా ఓ సినిమాలో ధరించిన చెప్పుల జత... వేలంపాటలో రూ.2.5 లక్షలకు అమ్మేసింది. వచ్చిన ఆ మొత్తాన్ని యునిసెఫ్​ 'సేవ్​ ద గర్ల్​' కార్యక్రమానికి విరాళంగా ఇచ్చింది. ఓసారి ప్రియాంక వేసుకున్న గావిన్ మిగ్యుల్ బ్రాండ్​ డ్రెస్​ వేలంవేస్తే రూ.1000 నుంచి మొదలై, రూ.50 వేల వద్ద ఆగింది.​

5. జంగ్లీ​ జాకెట్​

బాలీవుడ్ ఆల్​టైం హిట్​ 'జంగ్లీ' సినిమాలో షమ్మీ కపూర్​ ధరించిన, అప్పటి ట్రెండింగ్​ జాకెట్​ను... వేలంపాటలో అక్షరాల రూ.80 వేలకు సొంతంచేసుకున్నారు హీరో అమిర్​ఖాన్​.

iconic items used in Bollywood films
షమ్మీ కపూర్​ ధరించిన అప్పటి ట్రెండింగ్​ జాకెట్​

6. వెండి ఉంగరమైనా

ముజాఫర్​ అలీ తీసిన 'ఉమ్రావ్​ జాన్' చిత్రంలో ఫరూక్ షేక్​ నవాబ్​ సుల్తాన్​ పాత్ర పోషించారు. ఆయన ఎడమచేతి వేలికి పెట్టుకున్న ఓ వెండి ఉంగరాన్ని.. ఓసియన్​ ఆక్షన్​లో వేలం​ వేయగా, రూ. 96 వేలు పలికింది.

iconic items used in Bollywood films
ఉమ్రావ్​ జాన్ చిత్రంలో ఫరూఖ్​ షేక్ ఉంగరం!​

ఇదీ చదవండి:యోగాసనాలు నేర్పిస్తున్న 'పెదరాయుడు' కుమార్తె

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.