ETV Bharat / sitara

నేను డేటింగ్ యాప్​లో లేను: కియరా అడ్వాణి - నేను డేటింగ్ యాప్​లో లేను: కియరా అడ్వాణి

నిజమైన ప్రేమను మాత్రమే నమ్ముతానని అంటోంది బాలీవుడ్ నటి కియరా అడ్వాణి. తాను డేటింగ్​ యాప్​లో ఉన్నట్లు వస్తోన్న వార్తలను ఖండించింది.

కియరా
కియరా
author img

By

Published : May 14, 2020, 7:31 PM IST

బాలీవుడ్‌లో గతేడాది విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరైన అందాల భామ కియరా అడ్వాణి. 'కబీర్‌ సింగ్‌'లాంటి రొమాంటిక్‌ చిత్రంలో నటించి యువతకు మరింత చేరువైంది. 'గుడ్‌న్యూజ్‌'లాంటి హాస్యభరిత సినిమాలోనూ తనదైన శైలిలో నవ్వించింది. తాజాగా వ్యక్తిగత జీవితం, డేటింగ్, ప్రేమలాంటి విషయాల గురించి కియరా ఓ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు పంచుకుంది.

"ఇప్పుడు ప్రతి ఒక్కపనికి డిజిటల్‌పై ఆధారపడుతున్నాం. ప్రస్తుతం నేను ఎలాంటి ప్రేమలో లేను. కొంతమంది చెప్పినట్లు నేను డేటింగ్‌ యాప్‌లో లేను. అయినా అది అంత సౌకర్యం కూడా కాదని నా నమ్మకం. మనకు తెలిసిన వ్యక్తి అయితే అతని తప్పొప్పులు తెలుస్తాయి. అదే డిజిటల్‌ యాప్‌ ద్వారా అవతలి వ్యక్తి గురించి మనకు తెలియదు. అసలు ప్రేమంటే ఏమిటి? దానికి నిజమైన అర్థం ఏమిటో తెలుసుకోవాలి. నేనెప్పుడైనా నిజమైనా ప్రేమను మాత్రమే నమ్ముతాను. ఆన్‌లైన్‌ ఎంతోమందిని కలిపింది. కొంతమంది ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకున్నవారు కూడా తెలుసు. మనం ఎలా కలిశాం, అన్నది ముఖ్యం కాదు. యాప్‌లో కంటే నేను నిజమైన ప్రేమను నమ్ముతా"

-కియరా అడ్వాణి, హీరోయిన్

ప్రస్తుతం కియరా 'ఇందూ కి జవానీ'లో ఓ చిన్నపట్టణానికి చెందిన అమ్మాయి పాత్రలో నటిస్తోంది. ఇందులో కియరా ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌ను కనిపెట్టిన యువతి పాత్రలో సందడి చేయనుందట. అక్షయ్‌ కుమార్‌తో కలిసి నటించిన 'లక్ష్మీబాంబ్‌' చిత్రం త్వరలోనే ఓటీటీ ద్వారా విడుదల కానుందని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.