ఇటీవల 'హిట్' అంటూ వచ్చి ప్రేక్షకులను అలరించాడు హీరో విశ్వక్ సేన్. అయితే ఈ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సినిమాకు దర్శకత్వం వహించాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టాడు. గతంలో మహేశ్ అభిమానిని అని, ప్రస్తుతం జూ.ఎన్టీఆర్‌కు ఫ్యాన్ అని అన్నాడు.
'పాగల్'తో బిజీ
'హిట్' చిత్రంతో ఎలాంటి పాత్రైనా చేయగలనని నిరూపించిన విశ్వక్.. ప్రస్తుతం 'పాగల్'లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో నరేశ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన షూటింగ్.. కరోనా వల్ల నిలిచిపోయింది. ఇందులో కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుందని సమాచారం.
పరిచయమయ్యాడిలా
'వెళ్లిపోమాకే' వంటి ప్రేమకథతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు విశ్వక్. కానీ 'ఈ నగరానికి ఏమైంది' తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హీరోగా, దర్శకుడిగా 'ఫలక్‌నుమాదాస్' తీశాడు.
ఇదీ చదవండి: దద్దరిల్లిన 'సరిలేరు నీకెవ్వరు' టీవీ రేటింగ్స్