తాను చిన్నప్పటి నుంచి ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య గురించి హీరోయిన్ కాజల్ అగర్వాల్ వివరించింది. ఐదేళ్ల వయసు నుంచే ఆస్తమాతో బాధపడుతున్నానని తెలిపింది. దీంతో తిండి విషయంలో చాలా నియంత్రణ పాటించాల్సి వచ్చిందని చెప్పింది.
అంత చిన్న వయసులో చాక్లెట్లు, డైరీమిల్క్ లాంటి వాటికి దూరంగా ఉండాలంటే ఎలా కష్టమో ఊహించుకోవచ్చని కాజల్ తెలిపింది. ఇలా చాలా ఇబ్బందుల మధ్య పెరిగానని వెల్లడించింది. శీతాకాలం, దుమ్మ, దూళి లాంటి వల్ల చాలాసార్లు శ్వాసకోస సమస్యలు ఎదుర్కొన్నానని, అలాంటప్పుడు ఇన్హేలర్స్ ఉపయోగించడం వల్ల తేరుకున్నానని చెప్పింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అప్పటినుంచి తన వెంట ఇన్హేలర్స్ను తీసుకెళ్తున్నానని కాజల్ తెలిపింది. అయితే మనదేశంలో లక్షల మంది ఇన్హేలర్స్ వినియోగించాల్సిన అవసరముందని, ఎవరో ఏదో అనుకుంటారని వాళ్లు వాడటం లేదని చెప్పింది. దానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని, ఇప్పటికైనా అర్ధం చేసుకుని #SayYesToInhalers కార్యక్రమంలో భాగం కావాలని కోరింది.
ఇది చదవండి: తన భర్త గురించి హీరోయిన్ కాజల్ మాటల్లో..