ETV Bharat / sitara

నేను వాళ్లలా కనిపించాలనుకుంటున్నా: మానుషీ చిల్లర్​

author img

By

Published : Mar 15, 2020, 6:11 AM IST

Updated : Mar 15, 2020, 6:51 AM IST

మిస్ ఇండియా, మిస్​ వరల్డ్ మానుషీ చిల్లర్ 'పృథ్వీరాజ్​' సినిమాలో నటిస్తోంది. ఇదే తనకు తొలి చిత్రం. అక్షయ్​ కుమార్​ టైటిల్​ రోల్​ పోషిస్తున్నాడు. తాజాగా తాను భవిష్యత్తులో భారతీయ మహిళా సుగుణాలు ఉట్టిపడే పాత్రలు చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

Manushi Chhillar
నేను వాళ్లలా కనిపించాలనుంకుంటున్నా

2017లో ప్రపంచసుందరిగా నిలిచిన మానుషీ చిల్లర్​... 'పృథ్వీరాజ్​' సినిమాలో సన్యోగితా పాత్రతో తెరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్​ హీరో అక్షయ్​కుమార్​ టైటిల్​ రోల్​ పోషిస్తున్నాడు. అయితే తాజాగా తాను చిత్రాల్లో ఎలాంటి పాత్రలు పోషించాలనుకుంటుందో తెలిపింది ముద్దుగుమ్మ.

భారతీయ మహిళా సంప్రదాయ, కట్టుబాట్లు తెలిపే పాత్రలు పోషించాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఓ భారతీయ మహిళ ప్రదర్శించే ముందుచూపు, మాటతీరు, స్వతంత్రత భావాన్ని ఉట్టిపడే పాత్రలు చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

"పృథ్వీరాజ్​ సినిమాలో అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నాను. శాయశక్తులా శ్రమించి నా పాత్రకు పూర్తి న్యాయం చేస్తాను. నా సినిమా విడుదలైనప్పుడు... ప్రేక్షకుల నుంచి వారి అభినందనలు పొందాలని ఆశిస్తున్నాను. భవిష్యత్తులో భారతీయ మహిళా సుగుణాలు ఉట్టిపడే పాత్రలు చేయాలనుకుంటున్నాను. "

-మానూషీ చిల్లర్​, 2017 మిస్స్​ఇండియా.

'పృథ్వీరాజ్​' చిత్రానికి చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్నాడు. యశ్​రాజ్ ఫిల్మ్స్​ నిర్మాతగా వ్యవహరిస్తోంది.

Manushi Chhillar
నేను వాళ్లలా కనిపించాలనుంకుంటున్నా

ఇదీ చూడండి : మాజీ ప్రపంచ సుందరి హాట్​ ఫొటో షూట్

Last Updated : Mar 15, 2020, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.