ETV Bharat / sitara

'నేనూ, ఆలియా ఎప్పుడో పెళ్లి చేసుకునే వాళ్లం'

కరోనా​ మహమ్మారి లేకుంటే.. ఆలియా భట్, తాను ఎప్పుడో పెళ్లి చేసుకునేవాళ్లమని చెప్పాడు బాలీవుడ్​ హీరో రణ్​బీర్​ కపూర్​. లాక్​డౌన్​లో ఆలియా ఎన్నో నేర్చుకుంటే.. తాను మాత్రం సినిమాలు చూస్తూ గడిపానని తెలిపాడు.

I think Alia & I would've been married if the pandemic hadn't hit our lives: Ranbir
'నేనూ, ఆలియా ఎప్పుడో పెళ్లి చేసుకునే వాళ్లం'
author img

By

Published : Dec 24, 2020, 1:04 PM IST

కరోనా మహమ్మారి అడ్డురాకుంటే.. తన ప్రేయసి ఆలియా భట్​ను ఎప్పుడో పెళ్లి చేసుకునే వాడినని తెలిపాడు బాలీవుడ్​ స్టార్​ రణ్​బీర్​ కపూర్​. ఆలియాతో పోల్చుకుంటే తాను చాలా తక్కువ సాధించానని చెప్పాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన రణ్​బీర్​ ఈ విషయాలు వెల్లడించాడు.

I think Alia & I would've been married if the pandemic hadn't hit our lives: Ranbir
ఆలియా, రణ్​బీర్

"నా ప్రేయసి ఆలియా నాకంటే చాలా ఎక్కువ సాధించింది. లాక్​ డౌన్​లో నేనేం నేర్చుకోలేదు. కానీ, ఆలియా మాత్రం గిటార్​, స్క్రీన్​ ​రైటింగ్​ వంటివి ఆన్​లైన్​లో నేర్చుకుంది. లాక్​డౌన్​ మొదట్లో మా కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండేవి. ఆ తర్వాత నేను పుస్తకాలు చదివా. నా కుటుంబంతో గడిపా. ప్రతిరోజూ రెండు మూడు సినిమాలు చూశా. ఆలియాను, నన్ను మహమ్మారి దూరం చేసేసింది. లేదంటే.. ఎప్పుడో మేమిద్దరం ఏడడుగులు వేసే వాళ్లం. త్వరలోనే మా పెళ్లికబురు వినిపిస్తాం."

-రణ్​బీర్​ కపూర్​, బాలీవుడ్​ నటుడు.

మెదటిసారిగా వీరిద్దరూ 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో కలిసి నటిస్తున్నారు. అయాన్​ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​, కింగ్​ నాగార్జున, డింపుల్​ కపాడియా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇదీ చూడండి:'ఆ సమయంలో నన్ను రణ్​బీర్​ ఆదుకున్నాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.