ETV Bharat / sitara

సినీప్రముఖులపై ఐటీ దాడులు.. రూ.650 కోట్ల అక్రమాలు!

author img

By

Published : Mar 4, 2021, 10:28 PM IST

Updated : Mar 5, 2021, 7:27 AM IST

ముంబయిలోని సినీ ప్రముఖుల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు వరుసగా రెండోరోజు సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ.. దాదాపు రూ.300కోట్ల ఆదాయానికి సంబంధించిన వివరాలను చెప్పలేకపోయినట్లు ఓ ఆదాయపన్ను శాఖ అధికారి తెలిపారు. ఈ కేసులో మరిన్ని సాక్ష్యాధారాలను సేకరించినట్లు వెల్లడించారు.

tapsee
తాప్సీ

ముంబయిలోని సినీ ప్రముఖుల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు రెండో రోజు సోదాలు చేశారు. అయితే ఓ అగ్ర నిర్మాణ సంస్థ తన ఆదాయాన్ని భారీగా తగ్గించి చూపించినట్లు తనిఖీల సందర్భంగా అధికారులు గుర్తించారు. బాక్సాఫీస్ కలెక్షన్లతో పోలిస్తే తక్కువ ఆదాయాన్ని చూపించినట్లు ఆధారాలను సేకరించారు. మొత్తంగా ఈ రెండు రోజుల్లో వారు సేకరించిన వివరాలను ఓ ఆదాయపన్ను శాఖ అధికారి ఈ విధంగా తెలిపారు.

"ఈ రెండు రోజుల్లో రెండు ప్రముఖ నిర్మాణసంస్థలు, ఓ నటి, రెండు టాలెంట్​ మేనేజ్​మెంట్​ కంపెనీలపై సోదాలు నిర్వహించాం. ముంబయి, పుణె, దిల్లీ, హైదరాబాద్​ నగరాల్లోని 28 ప్రదేశాల్లోని వారి కార్యాలయాలతో సహా వారి ఇళ్లలో రైడ్లు చేశాం. అయితే ఓ అగ్ర నిర్మాణ సంస్థ.. తన బాక్సాఫీస్ కలెక్షన్లతో పోలిస్తే ఆదాయాన్ని భారీగా తగ్గించి చూపించింది. ఆ కంపెనీ అధికారులు దాదాపు రూ. 300 కోట్ల ఆదాయానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. అయితే దాదాపు రూ.350 కోట్ల రూపాయల ఆదాయానికి పన్ను ఎగవేసినట్లు ఆధారాలు లభించాయి. ఓ ప్రముఖ దర్శక నిర్మాత నకిలీ ఖర్చులు చూపించి రూ.20కోట్ల పన్ను ఎగవేత చేసినట్లు గుర్తించాం. ఓ నటి తీసుకున్న రూ.5 కోట్ల నగదు రసీదుల ఆధారాలను స్వాధీనం చేసుకున్నాం. రెండు టాలెంట్​ మేనేజ్​మెంట్​ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో డిజిటల్ డేటా(ఈమెయిల్స్​, వాట్స్​ప్​ చాట్స్​, హార్డ్​డిస్క్​ తదితరులు) జప్తు చేస్తుకున్నాం. ఏడు బ్యాంక్​ లాకర్లను గుర్తించి వాటిని మా నియంత్రణలోకి తీసుకున్నాం. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. "

- ఆదాయపన్ను శాఖ అధికారి

మార్చి 3న ప్రారంభమైన ఈ తనీఖీల్లో భాగంగా బాలీవుడ్​ హీరోయిన్ తాప్సీ, దర్శకుడు అనురాగ్ కశ్యప్, నిర్మాతలు మధు మంతెన, వికాస్ భల్​, రిలయన్స్​ ఎంటర్​టైన్​మెంట్​ సీఈఓ సిభాషిస్​ సర్కార్​కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.

2018లో పన్ను ఎగవేసిన ఫాంటమ్ ఫిల్మ్స్​తో​ పాటు దానితో సంబంధమున్న వారి ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. వీరి ఖాతాల నుంచి కొన్ని అనుమానాస్పద ఆర్థిక బదిలీలు జరిగాయన్న అనుమానంతో పాటు ఈ కేసులో భాగంగా మరిన్ని సాక్ష్యాలు సేకరించేందుకు సోదాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

ఫాంటమ్ ఫిల్మ్స్.. నిర్మాణ, సినిమాల పంపిణీ సంస్థ. అనురాగ్ కశ్యప్, దర్శకుడు విక్రమాదిత్య మోత్వాని, నిర్మాత మధు మంతెన, వికాస్ భల్ కలిసి 2011లో దీనిని స్థాపించారు. అయితే 2018లో వికాస్​పై అత్యాచార ఆరోపణలు రావడం వల్ల సదరు సంస్థను మూసివేశారు.

ఇదీ చూడండి: హీరోయిన్ తాప్సీ, దర్శకుడు అనురాగ్​లపై ఐటీ దాడులు

Last Updated : Mar 5, 2021, 7:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.