ETV Bharat / sitara

సాయిపల్లవిపై చిరు, ఆమిర్​ ప్రశంసలు

నటి సాయిపల్లవితో(love story sai pallavi) కలిసి డ్యాన్స్​ చేయాలని ఉందని తన మనసులో మాటను చెప్పారు మెగాస్టార్​ చిరంజీవి. బాలీవుడ్​ స్టార్​ ఆమిర్​ ఖాన్​ అయితే ఆమెకు అభిమానినని అన్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన 'లవ్​స్టోరీ' సినిమా ముందస్తు విడుదల వేడుకకు(love story prerelease event) ముఖ్య అతిథులుగా హాజరైన చిరు, ఆమిర్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

saipallavi
సాయిపల్లవి
author img

By

Published : Sep 19, 2021, 10:00 PM IST

"నా సినిమాలో నటించేందుకు సాయి పల్లవి(love story sai pallavi) ఒప్పుకోకపోతే బాగుణ్ణు అనిపించింది" అని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. 'లవ్‌స్టోరి' చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల(love story sekhar kammula trailer) తెరకెక్కించిన చిత్రమిది. సెప్టెంబరు 24న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ముందస్తు విడుదల వేడుకను చిత్రబృందం ఏర్పాటు చేసింది.

"కొవిడ్‌ సెలవుల తర్వాత విద్యార్థులు పాఠశాలకు వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి అనుభూతే ఈ రోజు నాకు కలుగుతోంది. ప్రత్యక్షంగా ఇలాంటి వేడుకకు వచ్చి, ఆయా సినిమాల గురించి మాట్లాడుతూ ప్రేక్షకుల చప్పట్లు వింటున్నప్పుడు వచ్చే ఆ కిక్కే వేరు. నిర్మాత నారాయణ్‌ దాస్‌ గారంటే నాకెంతో గౌరవం. 1980ల నుంచి ఆయనతో నాకు పరిచయం ఉంది. ఆయన్ను నా గురువులా భావిస్తాను. ఆయన తనయుడు సునీల్‌ చాలా స్మార్ట్‌. ప్రస్తుతం మల్టీప్లెక్స్‌లు ఇంత బాగా ఉండటానికి కారణం సునీలే. నాగ చైతన్య నిలకడగా వ్యవహరించే నటుడు. తను ఎంపిక చేసుకునే కథలు, కాంబినేషన్లు చాలా బాగుంటున్నాయి. నాగ చైతన్య, నా మిత్రుడు ఆమిర్ ఖాన్‌ కలయికలో రూపొందుతోన్న 'లాల్‌సింగ్‌సింగ్‌ చద్దా' (aamir khan lal singh chaddha trailer)సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ వేడుకకు వచ్చిన ఆమిర్‌ఖాన్‌కు థ్యాంక్స్‌. ఇది యువ నటులకు ఆయనిచ్చే ప్రోత్సాహం. వరుణ్‌ తేజ్‌తో 'ఫిదా' సినిమా చేసేంతవరకు సాయి పల్లవి ఎవరో నాకు తెలియదు. ఈ చిత్రంలో తను డ్యాన్స్‌ చేసిన ఓ పాటన చూసి ఆశ్చర్యపోయా. ఓ సినిమాలో నాకు చెల్లెలిగా నటించేందుకు సాయిపల్లవి అయితే బాగుంటుందని చిత్ర బృందం అనుకుంది. కానీ, నాకు మాత్రం వద్దు అనిపించింది. తను ఒప్పుకోకూడదని మనసులో కోరుకున్నా. ఎందుకంటే అన్నాచెల్లెళ్లుగా నటించాలని నాకు లేదు. మంచి డ్యాన్సర్‌తో కలసి నేనూ డ్యాన్స్‌ చేయాలనుకుంటాను. కానీ, చెల్లెమ్మా ఎలా ఉన్నావు? అని ఎలా అనగలను (నవ్వుతూ). శేఖర్‌ కమ్ముల తీసిన ప్రతి చిత్రమూ క్లాసిక్‌ అవుతుంది. ఈ చిత్రం మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా"

-చిరంజీవి, మెగాస్టార్​.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"మీలానే నేనూ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నా. నేనూ ఈ నెల 24నే ఈ చిత్రాన్ని చూస్తా. అంతకంటే ముందూ చూడను, ఆ తర్వాతా చూడను. తప్పకుండా థియేటర్‌లోనే ఈ చిత్రాన్ని చూస్తా. మహారాష్ట్రలో అధికారుల అనుమతి తీసుకుని ప్రైవేటు స్క్రీనింగ్‌ హాల్లో వీక్షిస్తా. చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందలు తెలుపుతున్నా. సాయి పల్లవి డ్యాన్సుకు నేను అభిమానిని. ఈ రోజు ఆమెను కలవడం సంతోషంగా ఉంది."

-ఆమిర్‌ఖాన్‌, బాలీవుడ్​ స్టార్​ హీరో.

'ఈ వేడుకకు విచ్చేసిన చిరంజీవి(chiranjeevi love story), ఆమిర్‌ఖాన్‌(aamir khan love story) చాలా థ్యాంక్స్‌' అన్నారు చిత్ర నిర్మాత నారాయణ్‌దాస్‌ కె. నారంగ్‌. 'ఆమిర్‌ఖాన్‌ సర్‌ ముందు మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. నన్ను నమ్మి ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చిన దర్శకుడు శేఖర్‌ కమ్ములకు(love story release date), ఈ చిత్రంలో పాటలు రాసిన, పాడిన వారికి ధన్యవాదాలు' అని సంగీత దర్శకుడు పవన్‌ పేర్కొన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ ఆన్‌లైన్‌ వేదికగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: 'ఆ ఘటనకూ 'లవ్​స్టోరి'కి సంబంధం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.