ETV Bharat / sitara

ప్రియాంక చోప్రా వల్ల అవకాశాలు రావట్లేదు: మీరా - Priyanka chopra latest news

నటిగా తనకు అవకాశాలు ఎక్కువగా రావట్లేదని వాపోయింది మీరాచోప్రా. ప్రియాంక చోప్రా సోదరి కావడం వల్లే ఇలా జరుగుతోందని తెలిపింది.

I have not got any work because of Priyanka: Meera chopra
ప్రియాంక చోప్రా మీరా చోప్రా
author img

By

Published : Apr 28, 2021, 10:46 AM IST

ప్రియాంక చోప్రా వల్ల తనకు అవకాశాలు రావట్లేదని ఆమె కజిన్ మీరా చోప్రా ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల ఓ జూమ్ కాల్​లో మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకుంది. ఆమె సోదరిని కావడం వల్ల నిర్మాతలు తనను తీసుకోవట్లేదని తెలిపింది.

"ప్రియాంక వల్ల నాకు ఏ పని రావట్లేదు. ఆమె సోదరిని కావడం వల్ల నిర్మాతలు నన్ను తీసుకోవడం లేదు. ప్రియాంక వల్ల నా కెరీర్​లో ఎలాంటి ఎదుగుదల కూడా లేదు" అని మీరా చోప్రా చెప్పింది.

2005లో తమిళ సినిమా 'అన్బు అరియరే'తో హీరోయిన్​గా పరిచయమైన మీరా చోప్రా.. ఆ తర్వాత తెలుగు, కన్నడలోనూ కథానాయికగా పలు చిత్రాల్లో నటించింది. ఆమె చివరగా 2019లో వచ్చిన 'సెక్షన్ 375' కీలక పాత్ర పోషించింది.

మరోవైపు ప్రియాంక చోప్రా.. హాలీవుడ్​, బాలీవుడ్​లో నటిస్తూ గ్లోబల్ స్టార్​గా గుర్తింపు తెచ్చుకుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.