ETV Bharat / sitara

Prabhas: ఆ సీన్​ చేసేందుకు చాలా ఇబ్బందిపడ్డా - ప్రభాస్ చక్రం సన్నివేశం

ఓ సన్నివేశం ప్రభాస్​ను చాలా ఇబ్బంది పెట్టిందట. ఆ సీన్​లో నటించడానికి చాలా ఇబ్బందిపడినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు డార్లింగ్. అదేంటో మీరే చూసేయండి.

prabhas
ప్రభాస్
author img

By

Published : Jun 3, 2021, 10:27 AM IST

"ఆ సీన్‌లో న‌టించేందుకు కాస్త ఇబ్బందిగా అనిపించింది.. క‌థ డిమాండ్ మేర‌కు న‌టించాల్సి వ‌చ్చింది" అనే మాట‌లు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వినిపిస్తూనే ఉంటాయి. అగ్ర క‌థానాయ‌కుడు ప్ర‌భాస్‌(Prabhas)కు ఇలాంటి సంఘ‌ట‌నే ఎదురైంది. ఓ ఇంట‌ర్వ్యూలో.. మీరు ఏ స‌న్నివేశం కోసం బాగా క‌ష్ట‌ప‌డ్డారు? అనే ప్ర‌శ్నకి ప్ర‌భాస్ ఇలా స‌మాధానం ఇచ్చారు.

"చ‌క్రం'(Chakram)లోని ఓ సీన్ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డా. సినిమాల్లోకి రాక‌ముందు నాకు గే సంస్కృతి గురించి అసలు తెలియదు. క‌థానాయ‌కులు అమ్మాయిల్లా నటించ‌డమూ నాకు న‌చ్చేది కాదు. కానీ, 'చ‌క్రం'లో అలాంటి స‌న్నివేశం ఒక‌టి చేయాల్సి వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ గురించి తెలిసిందే క‌దా. ఆయ‌న చాలా కచ్చితంగా వ్యవహరిస్తారు. దాంతో చేయ‌క త‌ప్ప‌లేదు. ఆ స‌న్నివేశంలో న‌టించేట‌ప్పుడు చెమ‌ట్లొచ్చేసేవి."

-ప్రభాస్, నటుడు

ప్ర‌స్తుతం ప‌లు పాన్ ఇండియా ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు ప్ర‌భాస్‌. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఆది పురుష్‌' (Adipurush), ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో 'స‌లార్' (Salaar) చిత్రాల్లో న‌టిస్తున్నాడు. నాగ్ అశ్విన్‌తో ఓ సినిమా ఖ‌రారు చేశారు. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన 'రాధే శ్యామ్' (Radheshyam) త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.