ETV Bharat / sitara

'ఇకపై నా చిత్రాలూ ప్రేక్షకులు చూస్తారు'

బాలీవుడ్​ నటుడు విద్యుత్​ జమ్వాల్​.. తాను నటించిన 'యారా' 'ఖుదా హాఫిజ్' చిత్రాలు ఓటీటీలో విడుదల కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు. ఈ ప్లాట్​ఫామ్ ద్వారా సినిమాలు విడుదలైతే ప్రజలు సొంత నిర్ణయంతో చిత్రాలను చూస్తారని అభిప్రాయపడ్డాడు. దీంతోపాటు జీవితంలో ఏ విషయం పట్ల అసంతృప్తి చెందనని స్పష్టం చేశాడు.

Vidyut Jammwal
విద్యుత్​ జమ్వాల్
author img

By

Published : Jul 28, 2020, 2:59 PM IST

Updated : Jul 28, 2020, 3:06 PM IST

బాలీవుడ్​ యాక్షన్​ నటుడు విద్యుత్​ జమ్వాల్​.. త్వరలోనే 'యారా', 'ఖుదా హాఫిజ్'​ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రాలు ఓటీటీ ప్లాట్​ఫామ్ జీ5, డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​ వేదికగా స్ట్రీమింగ్​ కానున్నాయి. అయితే ఈ సందర్భంగా తన చిత్రాల విడుదలపై మాట్లాడాడు విద్యుత్​.

తన సినిమాలు ఓటీటీలో రిలీజ్​ కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు. ఎందుకంటే ప్రేక్షకులు విమర్శకుల రేటింగ్​ ఆధారంగా కాకుండా తమ సొంత నిర్ణయంపై సినిమాలు చూస్తారని చెప్పాడు. ఏ సినిమా చూడాలి, ఏది చూడకూడదు అనే విషయాన్ని సొంతంగా నిర్ణయించుకోగల్గుతారని వెల్లడించాడు. దీంతో పాటు జీవితంలో ఏ విషయం పట్ల అసంతృప్తి చెందనని చెప్పుకొచ్చాడు.

"జీవితంలో ఏ సందర్భంలోనైనా అసంతృప్తి చెందను. సరైన సమయం వచ్చినప్పుడు సరైన విషయాలు జరుగుతాయి. బహుశా ఇప్పుడు నా విషయంలోనూ ఇదే జరిగిందని భావిస్తున్నా. ఓటీటీలో నా చిత్రం విడుదల చేయడం ద్వారా ఇప్పటివరకు నా సినిమాలు చూడనివారు కూడా ఇకపై చూస్తారని అనుకుంటున్నా."

-విద్యుత్​ జమ్వాల్​, కథానాయకుడు.

తాను నటించిన 'జంగ్లీ' సినిమా గురించి మాట్లాడుతూ.. "ఈ చిత్రం రూ. 100కోట్ల క్లబ్​లో స్థానం సంపాదించుకోలేకపోయింది. కానీ ఓటీటీ విడుదలయ్యాక విశేష ప్రజాదరణ పొందింది." అని చెప్పాడు విద్యుత్​.

Vidyut Jammwal
విద్యుత్​ జమ్వాల్

ఇది చూడండి ప్రముఖ నటుడు 'కిక్'​ శ్యామ్ అరెస్ట్

Last Updated : Jul 28, 2020, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.