ETV Bharat / sitara

హీరోయిన్​గా ఎంట్రీపై ఆమీర్​ఖాన్ కుమార్తె ఏమందంటే? - amirkhan new movie release date

Amirkhan daughter ira: గత కొద్ది రోజులుగా ఆమీర్​ ఖాన్​ కుమార్తె ఐరా సినిమాల్లో హీరోయిన్​గా రానుందని బాలీవుడ్​లో జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా అభిమానులతో ముచ్చటించిన ఆమె.. తన వెండితెర అరంగేట్రంపై స్పందించింది. ఇంతకీ ఈ భామ ఏం చెప్పిందంటే...

అమీర్​ఖాన్​ కుమార్తె
amirkhan daughter
author img

By

Published : Mar 5, 2022, 3:29 PM IST

Amirkhan daughter ira: చిత్రసీమ అంటేనే వారసత్వానికి చిరునామా. ఒకరు స్టార్‌గా నిలదొక్కుకుంటే చాలు.. వారి ఇంటి నుంచి వారసులు చాలా మంది తెరపైకి వస్తుంటారు. చివరకు ప్రతిభ ఆధారంగా సినీ రంగంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారు. ఆ విధంగానే బాలీవుడ్​ స్టార్​ హీరో అమీర్​ఖాన్​ కుమార్తె ఐరా ఖాన్​ కూడా హీరోయిన్​గా ఎంట్రీ ఇవ్వనుందని కొద్ది రోజులుగా బాలీవుడ్​లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐరా స్పందించింది.

ఇటీవలే ఐరా తన అభిమానులతో ఇన్​స్టాగ్రామ్​ లైవ్​చాట్​లో ముచ్చటించింది. మానసిక ఆరోగ్య సమస్యలపై పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఈ క్రమంలో ఓ సోషల్​ మీడియా యూజర్..​ నటిగా ఎప్పుడు ఎంట్రీ ఇవ్వనున్నారని అడిగారు. అందుకు సమాధానంగా ఐరా 'నేను నటిగా ఎంట్రీ ఇవ్వను' అని చెప్పింది.

amirkhan daughter ira
అమీర్​ఖాన్​ కుమార్తె 'ఐరా'

అయితే ఐరా నటిగా కాకపోయినా దర్శకురాలిగా రాణించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే భారత క్రికెట్​ ఆటగాడు యువరాజ్​ సింగ్​ భార్య హజీల్​ కీచ్​ నటించిన 'మేదియా' చిత్రానికి దర్శకత్వం వహించింది.

మరోవైపు ఆమీర్ పెద్ద కుమారుడు జునైద్ ఖాన్.. యశ్​ రాజ్ ఫిల్మ్స్​ తెరకెక్కిస్తున్న 'మహారాజా' సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. అమీర్​ఖాన్ నటించిన​ తాజా చిత్రం లాల్​ సింగ్​ చద్దా ఏప్రిల్​ 14న విడుదల కానుంది.

కాగా, ఐరా ఖాన్​ ప్రేమలో పడినట్లు బాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఫిట్​నెస్​ ట్రైనర్​ నుపూర్​ షీఖరేతో ఐరా డేటింగ్​లో ఉన్నట్లు పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు కూడా వస్తున్నాయి.

ఇదీ చదవండి: హాట్​కేకుల్లా అమ్ముడుపోతున్న 'రాధేశ్యామ్​', 'ఆర్​ఆర్​ఆర్​' టికెట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.