ETV Bharat / sitara

వరుస 'బయోపిక్'​లతో విద్యాబాలన్​ బిజీ

author img

By

Published : Aug 9, 2019, 9:27 AM IST

బాలీవుడ్​ నటి విద్యాబాలన్ వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె శాస్త్రవేత్తగా నటించిన 'మిషన్​ మంగళ్​' చిత్రం ఆగస్టు 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాతో పాటు ప్రముఖ మహిళా గణిత శాస్త్రవేత్త శకుంతలాదేవి బయోపిక్​లోనూ​,  మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీగా ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది.

తిండిపై తినేవాడి పేరు రాసుండాలి: విద్యాబాలన్​

హిందీ చిత్రసీమలో విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్న కథానాయిక విద్యాబాలన్​. ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్​ బయోపిక్​లో నటించిన ఈ భామ... త్వరలో ప్రముఖ గణితశాస్త్రవేత్త, భారతీయ మహిళ శకుంతలాదేవి పాత్రలో కనిపించనుంది. అక్టోబర్​లో ఈ చిత్రం పట్టాలెక్కనుంది. అను మీనన్‌ దర్శకుడు. అంబుదతియా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విక్రమ్‌ మల్హోత్రా నిర్మిస్తున్నాడు. 2020 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది చిత్రబృందం.

I am glad Kangana is doing Jayalalitha, says Vidya Balan
శకుంతలా దేవి

ఎవరీ శకుంతల...?

శకుంతలను ప్రపంచమంతా నడిచే కంప్యూటర్‌గా చెబుతుంటారు. శకుంతల తన ఐదవ ఏటనే 18 ఏళ్ల వయసుగల పిల్లలకు లెక్కలు చెప్పేది. అటువంటి మేధావి అయిన ఆమె... ఎక్కడా అధికారికంగా విద్యనభ్యసించలేదు. ఆమె 1982లో గిన్నిస్‌ బుక్‌ ప్రపంచ రికార్డు సాధించింది.

విద్యాబాలన్‌ ఇప్పటికే ఓ వెబ్‌ సిరీస్‌లో మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు బహుజన సమాజ్‌ పార్టీ అధ్యక్షురాలు, ఉత్తర్​ప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాయావతి బయోపిక్‌లోనూ నటించనున్నట్లు సమాచారం.

Vidya Balan
జయలలిత, ఇందిరాగాంధీ, మయావతి

ఇటీవల జయలలిత జీవిత చరిత్రలో నటించే ఛాన్స్​ కోల్పోయింది విద్యా. 'తలైవి'గా రాబోతున్న ఈ చిత్రంలో కంగనా కథానాయిక. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతోంది ఈ చిత్రం. ఎఎల్‌ విజయ్‌ దర్శకుడు. ఈ సినిమాలో అవకాశం చేజారిపోవడంపై మాట్లాడిన విద్యా.."జయలలిత పాత్రలో కంగనా నటించడం సంతోషంగా ఉంది. తొలుత ఆ జీవితచరిత్రలో నటించే అవకాశం నాకే వచ్చింది. అయినా తినే మెతుకుపై ఎవరిపేరు రాసుంటే వారే తింటారు" అని సమాధానమిచ్చింది.

New York, Aug 09 (ANI): President of the United Nations Security Council (UNSC), Joanna Wronecka, refused to comment on Pakistan's letter to United Nations regarding the abrogation of Article 370 in Jammu and Kashmir. Government of India has recently scrapped off 'Article 370' and made two Union Territories i.e. Jammu and Kashmir and Ladakh respectively. Though, Pakistan condemned Modi-led government's decision and wrote a letter to the Secretary General of the United Nations (UN) regarding the abrogation of Article 370 in Jammu and Kashmir. The United Nations has urged India and Pakistan to exercise restraint and maintain peace.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.