ETV Bharat / sitara

త్వరలోనే పూర్తిగా కోలుకుంటా: ఎన్టీఆర్

ఇటీవలే కరోనా బారినపడిన యంగ్​టైగర్ ఎన్టీఆర్​ ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపారు. రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు.

Tarak
ఎన్టీఆర్
author img

By

Published : May 14, 2021, 10:29 AM IST

కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ చెప్పారు. రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం ఆయన ఓ ట్వీట్‌ పెట్టారు. "ప్రతి ఒక్కరికీ రంజాన్‌ శుభాకాంక్షలు. నా ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తున్న మీకు, మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్నా. త్వరలోనే కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకుని, ఆరోగ్యవంతుడిగా మీ ముందుకు వస్తా. సురక్షితంగా ఉండండి. జాగ్రత్తలు పాటించండి" అని ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు.

  • Wishing everyone a happy Eid. Thank you one and all for your warm wishes and prayers. I am getting better and hope to test negative soon. Stay safe and take care.

    — Jr NTR (@tarak9999) May 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ నెల 10న ఎన్టీఆర్‌ కరోనా బారిన పడ్డారు. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచనలు పాటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే చిరంజీవి.. ఎన్టీఆర్‌కి ఫోన్‌ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే తారక్‌ కొవిడ్‌-19 బారిన పడ్డారని తెలుసుకున్న అభిమానులు ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ పలు ఆలయాల్లో పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ మరో కథానాయకుడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన కొరటాల శివ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నారు. త్రివిక్రమ్‌, ప్రశాంత్‌నీల్‌తోనూ తారక్‌ సినిమాలు చేయనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.