తన గుండెకు శస్త్ర చికిత్స జరిగిందని, ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు సంగీత దర్శకుడు శశిప్రీతమ్ తెలిపారు. తన ఆరోగ్యం గురించి పలు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసిన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు ధన్యవాదాలు తెలిపారు.
"ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనెల 4న నాకు గుండెపోటు వచ్చింది. వెంటనే నా మిత్రుడు రాజు బంజారాహిల్స్ సెంచరీ హాస్పిటల్‌కు తరలించారు. హార్ట్‌లో బ్లాక్ ఉండటం వల్ల యాంజియోప్లాస్టి చేశారు. ఒక స్టంట్ వేశారు. తీవ్ర గుండె నొప్పి నుంచి వైద్యులు కాపాడారు. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు".
---శశిప్రీతమ్, సంగీత దర్శకుడు
శశిప్రీతమ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆయన ఆరోగ్యంతో ఉన్నారని సెంచరీ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ అమీనుద్దిన్ ఒవైసీ తెలిపారు. మంగళవారం ఆయనను డిశ్చార్జీ చేసినట్లు వెల్లడించారు.
కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'గులాబీ', 'సముద్రం' తదితర చిత్రాలకు ఆయన సంగీతం అందించారు.
ఇదీ చూడండి:23 వేల మందికి ఆర్థిక సాయం చేసిన సల్మాన్