అక్షయ్ కుమార్ నటించిన హారర్ కామెడీ 'లక్ష్మీబాంబ్'.. త్వరలో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓ వాణిజ్య సంస్థ ధ్రువీకరించింది. తొలుత చర్చలు విఫలమైనా, ఆ తర్వాత ఒప్పందం కుదిరిందని చెప్పింది. కొన్నిరోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని స్పష్టం చేసింది.
ఈ సినిమాను ముందుగా రూ.145 కోట్లకు ఓటీటీకి విక్రయించారని ఓ వార్త సంస్థ తెలిపింది. ఆ తర్వాత రూ. 125 కోట్లకు నిర్మాతలు, హాట్‌స్టార్ మధ్య ఒప్పందం కుదిరిందని సదరు సంస్థే పేర్కొంది. థియేటర్లలో విడుదలై, వచ్చే కలెక్షన్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ ధరేనని చెప్పుకొచ్చింది. ఈ విషయమే ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ సినిమాలో అక్షయ్ కుమార్, కియారా అడ్వాణీ హీరోహీరోయిన్లుగా నటించారు. దక్షిణాది హిట్ చిత్రం 'కాంచన' రీమేక్‌గా రూపొందించారు. మాతృకను తీసిన రాఘవ లారెన్స్ దీనికీ దర్శకత్వం వహించారు.
ఇవీ చదవండి: