ETV Bharat / sitara

నాలుగో 'క్రిష్'​ కోసం నాలుగు పాత్రల్లో హృతిక్​! - Rakesh Roshan

'క్రిష్​' ఫ్రాంచైజీలో నాలుగో భాగం త్వరలో తెరకెక్కనుంది. ఇందులో 'కోయి మిల్​ గయా'లోని గ్రహాంతరవాసి పాత్ర జాదూ కూడా ఉండనుందని సమాచారం.

Hrithik Roshan to essay four characters in Krrish 4
నాలుగో 'క్రిష్'​ కోసం నాలుగు పాత్రల్లో హృతిక్​!
author img

By

Published : Jul 23, 2020, 7:16 AM IST

హృతిక్​ రోషన్​ నుంచి సినిమా ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది 'సూపర్​ 30', 'వార్'​ చిత్రాలతో విజయం అందుకున్న హృతిక్​.. కొత్త సినిమా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో కరోనా ప్రభావంతో అన్నీ ఆగిపోయాయి. ప్రస్తుతం​ తన తండ్రి రాకేష్​ రోషన్​ దర్శకత్వంలో 'క్రిష్​ 4' చేస్తున్నారు.

ఈ చిత్రంలో 'కోయి మిల్​ గయా'లో నటించిన గ్రహాంతరవాసి పాత్ర జాదూ కూడా ఉండనుందని తెలిసింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తి వార్త బాలీవుడ్​లో సందడి చేస్తోంది. ఈ చిత్రంలో హృతిక్​ నాలుగు పాత్రల్లో కనిపిస్తారని సమాచారం.

"రాకేష్​ రోషన్​ ఈ సినిమాకు భారీ స్థాయిలో విజువల్​ వండర్​గా తీర్చిదిద్దబోతున్నారు. కథ ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఇందులో హృతిక్​ నాలుగు పాత్రల్లో అలరిస్తారు" అని రాకేష్​ రోషన్​ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే హృతిక్​ అభిమానులకు పండగే.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.