జాకీ చాన్, ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్, కామెరున్ దియజ్ సహా పలువురు దిగ్గజ హాలీవుడ్ నటులు ఒకప్పుడు అడల్ట్ చిత్రాల్లో నటించినవారే. అయితే.. జీవితం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అలా చేయాల్సి వచ్చిందని కొందరు చెప్పుకొచ్చారు.
ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్..
ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్.. నటుడిగా చిత్రసీమలో అడుగుపెట్టకముందు.. తొలుత పోర్న్ స్టార్‌గా చేశాడు. ఆ తర్వాత గే పోర్న్ మోడల్‌గా జీవితం కొనసాగించాడు. అనంతరం హాలీవుడ్లో యాక్షన్ సూపర్‌స్టార్ స్థాయికి ఎదిగాడు. కాలిఫోర్నియా గవర్నర్‌గానూ విధులు నిర్వహించడం విశేషం.

కామెరున్ దియజ్
'ది మాస్క్' చిత్రంతో నటిగా గొప్ప పేరు సంపాదించుకున్న కామెరున్ తొలుత సాఫ్ట్ పోర్న్ చిత్రాల్లో నటించింది. తర్వాత గతాన్ని చెరిపివేయడానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఇంటర్నెట్ ఆమె గతాన్ని ఎప్పటికీ మరిచిపోయేలా చేయడం లేదు.

జాకీ చాన్..
ప్రముఖ నటుడు, కుంగ్ ఫూ స్టార్ జాకీ చాన్.. 2006లో ఓ అడల్ట్ చిత్రంలో నటించినట్లు వార్తలు వచ్చాయి. 'ఆల్ ఇన్ ది ఫామిలీ' అనే చిత్రంలో ఈయన నటించినట్లు తెలిసింది. అయితే.. బతుకుదెరువు కోసం ఈ చిత్రంలో నటించినట్లు జాకీ చాన్ చెప్పుకొచ్చారు.

సిల్వెస్టర్ స్టాల్లోన్
హాలీవుడ్ యాక్షన్ హీరోగా గుర్తింపు పొందాడు సిల్వెస్టర్ స్టాల్లోన్. కానీ.. కెరీర్ ప్రారంభంలో న్యూయార్క్ సిటీలో బతుకుదెరువు కోసం కొన్ని సాఫ్ట్ పోర్న్ చిత్రాల్లో ఆయన నటించాడు.

మాట్ లెబ్లాంక్
'ఫ్రెండ్స్' వెబ్‌సిరీస్‌లో నటించి గొప్ప పేరు సంపాదించుకున్న మాట్ లెబ్లాంక్ కూడా ఒకప్పుడు పోర్న్ ఇండస్ట్రీలో పని చేశారు. ఆ తర్వాత.. ఫ్రెండ్స్ సిరీస్‌తో అందరి ప్రశంసలను పొందారు. ఈ సిరీస్‌లో ఎపిసోడ్‌కు 1 మిలియన్‌కుపైగా పారితోషికాన్ని మాట్ తీసుకున్నట్టు తెలుస్తోంది.

సిబెల్ కెకిల్లి
'గేమ్ ఆఫ్ త్రోన్స్' వెబ్‌సిరీస్‌లో సిబెల్ కెకిల్లిది సుపరిచితమైన పాత్ర. అయితే.. గతంలో 'దిలారా' అనే పోర్న్ చిత్రంలో ఈమె నటించింది. ఈ వార్తలు బయటకురాగానే కుటుంబం నుంచి ఆమె దూరమవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.

హెలెన్ మిర్రెన్
1979లో వివాదాస్పదమైన రోమన్ చిత్రం 'కాలిగుల'లో నటించింది హెలెన్ మిర్రెన్. అయితే.. ఇది అడల్ట్ చిత్రం అని తనకు తెలియదని పలుమార్లు చెప్పుకొచ్చింది.
జోన్ హమ్
బుల్లితెరలో ప్రసారమైన 'మ్యాడ్ మెన్' సిరీస్‌తో నటుడిగా విజయాన్ని అందుకున్నజోన్ హమ్.. ఒకప్పుడు పోర్న్లో నటించినట్లు గతంలో పేర్కొన్నాడు.

షు కి
'ట్రాన్స్పోర్టర్' చిత్రంలో లీడ్ రోల్లో నటించిన షు కి ఇండస్ట్రీలోకి పోర్న్ మోడల్‌గానే అడుగుపెట్టింది. కొన్ని అడల్డ్ చిత్రాల్లో ఆమె నటించడం సహా.. చైనాకు సంబంధించిన ప్లేబాయ్ ఎడిషన్‌లోనూ మోడల్‌గా మెరిసింది.

ఇదీ చదవండి:ఫాతిమా సనా స్టన్నింగ్ పిక్స్.. ఆమిర్ కూతురు లైక్స్!