ETV Bharat / sitara

విల్​స్మిత్​ ఆస్కార్​ను వెనక్కి తీసేసుకుంటారా? - విల్​స్మిత్​ ఆస్కార్​ను వెనక్కి తీసేసుకుంటారా

Willsmith Oscar Award: స్టేజ్​పైనే మరో నటుడిని హీరో విల్​స్మిత్​ కొట్టిన నేపథ్యంలో అతడికి దక్కిన ఆస్కార్ అవార్డును వెనక్కి తీసేసుకోవాలని డిమాండ్​ వినిపిస్తోంది. మరి ఆస్కార్​ నిర్వహకులు అతడిపై చర్యలు తీసుకుంటారా? పురస్కారాన్ని వెనక్కి తీసేసుకుంటారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

will smith oscar
విల్​స్మిత్ ఆస్కార్​​
author img

By

Published : Mar 28, 2022, 3:56 PM IST

Willsmith Oscar Award: 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ఓ అనూహ్య ఘటన కూడా జరిగింది. తన భార్యపై జోక్​ వేయడం వల్ల స్టార్​ హీరో విల్​స్మిత్.. స్టేజ్​పైనే కమెడియన్ క్రిస్​ రాక్ చెంప చెళ్లుమనిపించాడు. ఆపై క్షమాపణ చెప్పాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్​మీడియాలో హాట్​ టాపిక్​గా మారింది. మరోవైపు ఈ పురస్కారాల ప్రదానోత్సవంలో విల్​స్మిత్​కు ఉత్తమ అవార్డు దక్కింది.

అయితే ఇప్పుడా అవార్డును వెనక్కి తీసుకోవాలనే డిమాండ్​ తెరపైకి వచ్చింది. అకాడమీ నిబంధనలకు విరుద్ధంగా క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు అతడి ఆస్కార్​ను వెనక్కి తీసుకోని గట్టి చర్యలు చేపట్టాలని కొందరు గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అకాడమీ స్పందించింది. "హింస ఏ రూపంలో ఉన్న అకాడమీ సహించదు. 94వ అకాడమీ అవార్డుల వేడుక జరగడం, విజేతలకు గుర్తింపు దక్కడంపై మేం సంతోషిస్తున్నాం" అని ట్వీట్​ చేసింది. అయితే పురస్కారాన్ని వెనక్కి తీసుకునే వ్యవహారంపై ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే విషయం కూడా చెప్పలేదు.

అకాడమీ రూల్స్​ ఏం చెబుతోందంటే... 2017లో విడుదల చేసిన అకాడమీ కండక్ట్​ కోడ్​.. అకాడమీ విలువలను పరిరక్షించడంతో పాటు తోటివారి గౌరవానికి భంగం కలిగించకూడదు. అకాడమీ వాతావరణంలో అనైతికంగా వ్యవహరించకూడదు అని చెబుతోంది.

ఇదీ చూడండి: Oscars 2022: భార్యపై అలాంటి జోక్​.. కమెడియన్​ చెంప చెళ్లుమనిపించిన హీరో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.