బాలీవుడ్ ముద్దుగుమ్మలు అలియాభట్, సయీ మంజ్రేకర్ ఇప్పటికే టాలీవుడ్‌లో అవకాశాలు సొంతం చేసుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం కాగా ఇప్పుడు మరో బ్యూటీ నగరంలో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. తారక్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. 'అరవింద సమేత' తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమా కావడం వల్ల 'ఎన్టీఆర్ 30' గురించి సినీ ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించి ఓ విషయం ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లుకొడుతోంది.
అతి త్వరలో రెగ్యులర్ షూట్ జరుపుకోనున్న ఈ సినిమాలో 'లవ్‌యాత్రి'తో మెప్పించిన బాలీవుడ్ నటి వరీన హుస్సేన్ అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే టెస్ట్ షూట్ కోసం ఆమె ఇటీవల హైదరాబాద్‌లో ల్యాండ్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆమె నటన పట్ల త్రివిక్రమ్ సుముఖత వ్యక్తం చేశారని దీంతో ఆమెకు ఈ సినిమాలో ఓ పాత్రను ఇచ్చారని నెట్టింట్లో చెప్పుకుంటున్నారు. సెకండ్ హీరోయిన్‌గా ఆమె కనిపించే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుతం ఎన్టీఆర్ 'ఆర్‌ఆర్‌ఆర్' పనుల్లో బిజీగా ఉండగా.. త్రివిక్రమ్ సైతం పవన్, రానా సినిమాకు మాటలు అందిస్తున్నారు.
ఇదీ చూడండి : అందుకే అక్టోబరు 13న 'ఆర్‌ఆర్‌ఆర్'?