ETV Bharat / sitara

ఆ రోజు బాగా ఏడ్చేశాను: రాశీఖన్నా - pakka commercial movie

ఒక్కో సినిమా చేసేకొద్దీ పరిణితి చెందుతున్నానని చెప్పింది హీరోయిన్​ రాశీ ఖన్నా(Rasikhanna movies). కెరీర్​ తొలినాళ్లలో తాను విపరీతంగా బరువు పెరిగిపోయినప్పుడు ఎదుర్కొన్న విమర్శలకు మానసికంగా కుంగిపోయినట్లు వెల్లడించాడు. ఇంకా తన కెరీర్​ గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. అవన్నీ ఆమె మాటల్లోనే..

rasikhanna
రాశీ ఖన్నా
author img

By

Published : Sep 5, 2021, 9:18 AM IST

'ఊహలు గుసగుసలాడే'తో తెరంగేట్రం చేసిన రాశీ ఖన్నా... ఆ తరువాత వచ్చిన అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. త్వరలో 'పక్కా కమర్షియల్‌'(pakka commercial movie), 'థ్యాంక్యూ'(thanku movie) సినిమాలతో మళ్లీ తెరమీద కనిపించనున్న ఈ దిల్లీ భామ తన మనసులోని ముచ్చట్లను చెబుతోందిలా.

అప్పుడు బాధపడ్డా...

సినిమాల్లోకి వచ్చిన కొన్నాళ్లకు కొన్ని కారణాల వల్ల విపరీతంగా బరువు పెరిగిపోయా. దాంతో చాలామంది విమర్శించడం మొదలుపెట్టారు. ఆ మాటలూ, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ట్రోల్స్‌ చూసి మానసికంగా కుంగిపోయా. కానీ తరువాత నాకు నేనే ధైర్యం చెప్పుకుని నా మునుపటి శరీరాకృతిని తెచ్చుకునేందుకు చాలా కష్టపడ్డా. వాకింగ్‌, యోగా, ధ్యానం, జిమ్‌... ఇలా అన్నిరకాలూ చేసి తిరిగి సన్నబడ్డా. అంతకు ముందు నన్ను విమర్శించినవారే ‘భలే సన్నబడ్డావని మెచ్చుకున్నారు.

rasikhanna
రాశీ ఖన్నా

నటిని కావాలనుకోలేదు

చిన్నప్పుడు గాయని కావాలనుకునేదాన్ని. కానీ పెద్దయ్యేకొద్దీ బాగా చదవడం వల్ల ఐఏఎస్‌ అయితే బాగుంటుందని అనిపించి ఇంకా కష్టపడి చదివేదాన్ని. ఆ లక్ష్యంతోనే దిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజీలో బి.ఎ.ఆనర్స్‌ పూర్తిచేశా. చదువైపోయాక ప్రకటనలకు కాపీరైటర్‌గా చేస్తున్నప్పుడు మోడలింగ్‌ చేసే అవకాశం రావడం వల్ల ఓసారి ప్రయత్నిస్తే పోయేదేముందని చేశా. కానీ ఆ తరువాత 'మద్రాస్‌ కెఫె'లో నటించే ఛాన్స్‌ రావడం వల్ల ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

rasikhanna
రాశీ ఖన్నా

షాట్‌ అయ్యాక ఏడ్చేశా...

ఒక సినిమా ఒప్పుకున్నప్పుడు... ఎలాంటి సీనులో అయినా నటించాల్సిందేనని 'మద్రాస్‌ కెఫె' చేస్తున్నప్పుడే అర్థమైంది. అందులో జాన్‌ అబ్రహంకు భార్యగా ఒకటిరెండు రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది. దాంతో షాట్‌ ఓకే అయ్యాక... వ్యానిటీ వ్యాన్‌లోకి వెళ్లిపోయి ఏడ్చా. సినిమాల్లో అవన్నీ భాగమేనని అర్థం చేసుకోవడానికీ, నటనను ఓ వృత్తిగానే చూడటానికీ నాకు చాలా సమయం పట్టింది. 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'లో అలాంటి సీన్లు చేయాల్సి వచ్చినప్పుడు ఏ కంగారూ లేకుండా నటించా. సినిమా విడుదల అయ్యాక కొందరు నా పాత్ర విషయంలో విమర్శించినా మనసుకు తీసుకోలేదు. ఒక్కో సినిమా చేసేకొద్దీ పరిణతి వస్తుందేమోనని అప్పుడు అనిపించింది.

నెయ్యి తప్పనిసరి

ఓ నటిగా పోషకాహారానికే ప్రాధాన్యం ఇచ్చినా... పొద్దుటిపూట నేను తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరిగా ఒకటిరెండు చెంచాల నెయ్యి ఉండేలా చూసుకుంటా. మన శరీరంలో ఉండే కొవ్వు కరగాలంటే కొవ్వుపదార్థాలను కూడా తీసుకోవాలనేది నా నమ్మకం.

rasikhanna
నెయ్యి

సీనియర్‌ను ఇష్టపడేదాన్ని

మొదటినుంచీ నేను చాలా అల్లరిచేసేదాన్ని. స్నేహితులతో కలిసి ఇరుగుపొరుగు వాళ్లకు వచ్చే ఉత్తరాలు దొంగిలించి చదివేదాన్ని. వాటిల్లో ప్రేమలేఖలు ఉంటే గనుక ఇంకా ఆసక్తిగా చదివి అందరికీ చెప్పి నవ్వుకునేదాన్ని. అయితే ప్లస్‌ టూకి వచ్చాక మా సీనియర్‌ను ఇష్టపడేదాన్ని. నేను కాస్త సిగ్గరిని కావడం వల్ల ధైర్యం చేసి నేరుగా చెప్పలేకపోయా. కొన్నాళ్లకు అతనే నాదగ్గరకు వచ్చి నేనంటే ఇష్టమని చెప్పాడనుకోండీ. రోజులు గడిచేకొద్దీ అది కేవలం ఆకర్షణ మాత్రమేనని అర్థమయ్యాక నన్ను చూసి నేనే నవ్వుకున్నా.

తనే నాకు అన్నీ...

బాలీవుడ్‌ నటి వాణీ కపూర్‌ నా బెస్ట్‌ఫ్రెండ్‌. మొదటిసారి పదేళ్లక్రితం తనను ఓ ఆడషన్‌లో చూశా. అప్పటినుంచీ మా మధ్య స్నేహం కుదిరింది. ఆ తరువాత కొన్నాళ్లు మేమిద్దరం కలిసి ముంబయిలో కూడా ఉన్నాం. ఇప్పుడు నేను హైదరాబాద్‌లో ఉంటున్నా.. మా ఇద్దరికీ ఏ మాత్రం తీరిక దొరికినా కలిసి ఔటింగ్‌కు వెళ్లిపోతాం. ఒకవేళ మా ఇద్దరిలో ఒక్కరికే ఖాళీ ఉంటే తను ఇక్కడకు రావడమో... నేను ముంబయి వెళ్లడమో చేస్తాం.

rasikhanna
వాణికపూర్​తో రాశీ ఖన్నా

ఇష్టపడే ఆహారం

లెబనీస్‌, చైనీస్‌ వంటకాలు

బలం,బలహీనత

నా కుటుంబమే

ఇష్టపడే ప్రదేశం

స్పెయిన్‌

తీరిక దొరికితే...

పాటలు పాడతా. కవిత్వం రాస్తా లేదా పుస్తకాలు చదువుకుంటా. ఒకవేళ షూటింగ్‌ నుంచి ఎక్కువ విరామం దొరికితే ఎక్కడికైనా వెళ్లేందుకు ప్రయత్నిస్తా.

rasikhanna
రాశీఖన్నా

నచ్చే సినిమా

బొమ్మరిల్లు

ఇదీ చూడండి: Bandla Ganesh: హీరోగా బండ్ల గణేశ్.. షూటింగ్ మొదలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.