ETV Bharat / sitara

స్వీటీ అనుష్కకు పెళ్లి.. వరుడు అతడేనా? - అనుష్క లేటేస్ట్ న్యూస్

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందా? ప్రస్తుతం ఈ విషయం గురించి సినీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఎవరా పెళ్లికొడుకు?

anushka marriage
అనుష్క శెట్టి
author img

By

Published : Apr 29, 2021, 8:12 AM IST

Updated : Apr 29, 2021, 8:25 AM IST

డార్లింగ్ ప్రభాస్-అనుష్క పెళ్లి చేసుకుంటారని గత కొన్నేళ్ల నుంచి చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిపై ఎప్పటికప్పుడు స్పందించిన ఈ ఇద్దరు.. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని చెబుతూ వచ్చారు. వయసు 40కి దగ్గరపడుతున్నాసరే వీరిద్దరూ ఇప్పటికీ సింగిల్​గానే ఉంటున్నారు. అయితే త్వరలో అనుష్కకు పెళ్లి జరగనుందట. దీని గురించే ప్రస్తుతం జోరుగా మాట్లాడుకుంటున్నారు.

anushka marriage
హీరోయిన్ అనుష్క

దుబాయ్​కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమారుడిని స్వీటీ వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. తనకంటే చిన్నవాడైనప్పటికీ ఈమె అంగీకరించిందని మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

ఓటీటీలో గతేడాది వచ్చిన 'నిశ్శబ్దం' సినిమాతో చివరగా అభిమానుల్ని పలకరించింది అనుష్క. ఆ తర్వాత ఎలాంటి కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోలేదు. అయితే నవీన్​ పోలిశెట్టితో నటించేందుకు ఈమె అంగీకారం తెలిపిందని, దర్శకుడు మహేష్​బాబు ఈ సినిమాను తెరకెక్కిస్తారని కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. దీనిపైనా స్పష్టత రావాల్సి ఉంది.

Last Updated : Apr 29, 2021, 8:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.