'కండనాళ్ ముదల్' చిత్రంతో కోలివుడ్‌కు పరిచయమైన నటి ఆండ్రియా. 'పచ్చైకిళి ముత్తుచ్చరం' చిత్రంలో శరత్‌కుమార్‌కు జంటగా నటించి అభిమానుల మనసు దోచింది. తాజాగా 'వడ చెన్నై' చిత్రంలో ధనుష్ సరసన కనిపించి అలరించింది. ఈ మూవీలో పడక సన్నివేశాల్లో నటనపై అప్పట్లో వివాదం చెలరేగింది. దీంతో ఆ సన్నివేశాన్ని తొలగించింది చిత్రబృందం. అయినా సామాజిక మాధ్యమాల్లో అది లీక్ అయింది. అయితే ఈ సన్నివేశంపై స్పందించిది ఈ ముద్దుగుమ్మ. ఒక్క సన్నివేశంలో ఆ విధంగా కనిపించడం వల్ల ఎక్కువగా అలాంటి అవకాశాలే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. మంచి కథ, పాత్ర ఉంటే పారితోషికాన్ని తగ్గించుకుని నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని పేర్కొంది.
![HEROIN ANDREA RESPONSE ABOUT HER MOVIE VADA CHENNAI BEDROOM SCENE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6233202_ss-2.jpg)
గతంలో కార్తితో 'ఆయిరత్తిల్ ఒరువన్', అజిత్‌తో 'మంగాత్త', కమల్‌హాసన్‌తో 'విశ్వరూపం', 'ఉత్తమ విల్లన్', ధనుష్‌తో 'వడ చెన్నై' చిత్రాల్లో మెప్పించింది. ప్రస్తుతం 'మాళిగై', 'మాస్టర్', 'అరణ్మనై-3' చిత్రాల్లోనూ నటిస్తోంది.
![HEROIN ANDREA RESPONSE ABOUT HER MOVIE VADA CHENNAI BEDROOM SCENE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6233202_de.jpg)