ETV Bharat / sitara

'ఉప్పెన'.. విజయ్ దేవరకొండ చేయాల్సిందట?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. మరో మంచి సినిమా మిస్ అయ్యాడట! 'ఉప్పెన' హీరోగా తొలుత ఇతడినే అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం కాస్త వైష్ణవ్​కు వెళ్లిందట. ఇంతకీ దీని సంగతేంటి?

Vijay Devarakonda was the first choice for Uppena
విజయ్ దేవరకొండ ఉప్పెన
author img

By

Published : Jul 10, 2021, 8:37 PM IST

ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన 'ఉప్పెన'.. బాక్సాఫీస్​ దగ్గర ఎంతలా సందడి చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలిసినిమాతోనే మెగాహీరో వైష్ణవ్​తేజ్-ముద్దుగుమ్మ కృతిశెట్టి ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. క్యూట్​ జోడీ అని ప్రేక్షకులతో పిలిపించుకున్నారు. అయితే ఈ సినిమా కథ వైష్ణవ్​ కోసం రాసింది కాదట. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు వెల్లడించారు.

సుకుమార్ శిష్యుడు అయిన బుచ్చిబాబు.. కొన్నేళ్ల క్రితం విజయ్ దేవరకొండను దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాసుకున్నారట. అయితే 'అర్జున్​రెడ్డి' తర్వాత విజయ్ ఇమేజ్​ మారిపోయింది. దీంతో కథలో చిన్నపాటి మార్పులు చేసి, వైష్ణవ్​ను కథానాయకుడిగా ఎంపిక చేశారట. ఒకవేళ ఈ సినిమా విజయ్ దేవరకొండ చేసి ఉంటే ఎలాంటి సంచలనాలు సృష్టించేదో?

.
.

ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయి. 'నీ కన్ను నీలి సముద్రం', 'జలజలపాతం' సాంగ్స్​ అయితే ఇప్పటికీ ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.