కరోనాతో వచ్చిన లాక్డౌన్ వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా మధ్య తరగతి కుటుంబాలు.. నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఇక్కట్లు పడుతున్నాయి. వీరికోసం తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు హీరో విజయ్ దేవరకొండ. మొత్తంగా రూ.కోటి 30 లక్షలు విరాళాన్ని ప్రకటించాడు. ఇందులో భాగంగా వారికి కావాల్సిన సామాగ్రిని, తన టీమ్ ద్వారా అందించనున్నాడు. అందుకోసం పేరు ఎలా నమోదు చేసుకోవాలో చెబుతూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకున్నాడు.
https://thedeverakondafoundation.org ఈ వెబ్సైట్లో కుటుంబానికి సంబంధించిన వివరాలు నింపాలి. తర్వాత #టీమ్_విజయ్_దేవరకొండ నుంచి వారికి ఫోన్ వస్తుంది. తమ ఇంటి దగ్గర్లోని కిరాణా దుకాణానికి వెళ్లి కావాల్సిన సామాగ్రి తీసుకున్న అనంతరం, విజయ్ టీమ్.. ఆ కుటుంబం తరఫున ఆ షాపు వాడికి డబ్బులు చెల్లిస్తారు అని విజయ్ చెప్పాడు.
దీనితో పాటే భవిష్యత్తులో కొంతమంది యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన విషయాల్ని ఈ వీడియోలో పంచుకున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">