ETV Bharat / sitara

'ఆ విషయం త్రివిక్రమ్ పసిగట్టేశారు' - movie news

'ఇచ్చట వాహనములు నిలుపరాదు'తో ప్రేక్షకుల ముందుకొస్తున్న సుశాంత్.. సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాల్ని చెప్పారు. సినిమాల విషయంలో ఒత్తిడి తీసుకోవడం గత కొన్నేళ్ల నుంచి మానేశానని అన్నారు.

hero sushanth about ichata vahanamulu nilupa radu movie
సుశాంత్
author img

By

Published : Aug 27, 2021, 7:21 AM IST

"ఇచ్చట వాహనములు నిలుపరాదు' చిత్ర విజయంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. వినోదాత్మకంగా సాగుతుంది" అని హీరో సుశాంత్ అన్నారు. 'చి.ల.సౌ', 'అల.. వైకుంఠపుర ములో' వంటి విజయాల తర్వాత ఆయన కొత్త చిత్రమిది. ఎస్.దర్శన్ దర్శకుడు. మీనాక్షి చౌదరి హీరోయిన్. ఈరోజే(ఆగస్టు 27) ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్​లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సుశాంత్.

.
.
  1. "చి.ల.సౌ విడుదలకు రెండు నెలల ముందే దర్శన్ నాకీ కథ వినిపించారు. తన ఫ్రెండ్ జీవితంలో జరిగిన సంఘటనలతో ఆయన ఈ కథ అల్లుకున్నారు. కథ విన్నప్పుడు చాలా ఫ్రెష్​గా అనిపించింది. మరి సంక్లిష్టమైన కథయితే కాదు కానీ.. వాస్తవికతకు ఎంతో దగ్గరగా ఉంటుంది. అలాగే వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే కథ వినగానే చేస్తానని చెప్పా. అయితే మధ్యలో నేను 'అల వైకుంఠపురములో' సినిమా చేయడం వల్ల ఇది ఆలస్యంగా మొదలైంది.
  2. "ఈ సినిమాను గతేడాది ఫిబ్రవరి 1నే ప్రారంభించినా. మార్చి 15 కల్లా మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసేశాం. అందుకే జూన్​లోనే విడుదల చేసేద్దామనుకున్నాం. లాక్​డౌన్ వల్ల పరిస్థితి అంతా మారిపోయింది. ఈ జనవరి నెలాఖరులో తీసుకొద్దామనుకున్నా.. నిర్మాణాంతర కార్యక్రమాలు ఆలస్యమయ్యాయి. ఈ లోపు మళ్లీ సెకండ్ లాక్​డౌన్ వచ్చింది. మధ్యలో ఓటీటీ ఆఫర్లు చాలా వచ్చాయి. కానీ, ఇది థియేటర్లలో చూడాల్సిన చిత్రమని ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాం. నేనిప్పటి వరకు చేసిన సినిమాల్లో బెస్ట్ వర్క్ ఇదే"
  3. "ఈ చిత్రానికి మొదట 'నో పార్కింగ్ అనే టైటిల్ అనుకున్నాం. కానీ, తెలుగులో పేరుండాలని. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే టైటిల్ ఖరారు చేశాం. మిగతా భాషల వారికీ అర్ధమవ్వాలని 'నో పార్కింగ్'ను ఉపశీర్షికగా పెట్టేశాం. ఈ చిత్రం ఇప్పటికే కొంత మందికి చూపించాం. చూసిన ప్రతిఒక్కరూ బాగుందని, చాలా నవ్వుకున్నామని అన్నారు. ఈ సినిమాలో కొత్త సుశాంత్ కనిపించాడన్నారు. చాలా సంతోషంగా అనిపించింది"
    .
    .
  4. "కుటుంబం, స్నేహితులు, బంధాలు.. ఇవన్నీ ఎంత ముఖ్యమో ఈ కరోనా వల్ల తెలుసుకున్నా. ఒత్తిడిగా ఫీలవడం కంటే మనం మన వాళ్లతో, మనల్ని ప్రేమించే వాళ్లతో ఉన్నామని అనుకోవడం మంచిది. ఈ లాక్ డౌన్​లో మెడిటేషన్ చేయడం ప్రారంభించా. పియానో నేర్చుకున్నా. పెళ్లి విషయంలో ఇంట్లో వాళ్ల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలని ఏమీ అనుకోవట్లేదు. సరైన అమ్మాయి దొరికితే చాలు అనుకుంటున్నా ప్రస్తుతం నేను ఓ ద్విభాషా కథ విన్నా బాగా నచ్చింది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తా".
  5. "ఏం చేసినా సొంతంగా చేసుకోవాలని.. మన కాళ్లపై మనమే నిలబడాలని 'చిలసౌ' చిత్రానికి ముందు నాగార్జున చెప్పారు. అందుకే నాకు నచ్చిన సినిమా చేస్తే ఆ ఫలితం తెరపై కనిపిస్తుందనుకున్నాను. అనుమానాలు పెట్టుకుంటే ఏదైనా అంత పర్ఫెక్ట్ గా రాదనుకున్నా. అప్పటి నుంచే ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం మానేశా. ప్రతి చిత్రాన్ని ఆస్వాదిస్తూ చేయడం నేర్చుకున్నా. ఆ విషయాన్ని త్రివిక్రమ్ సర్ పసిగట్టి "సెట్​లో షూట్​ను చాలా ఎంజాయ్ చేస్తున్నావ్" అని నాతో అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.