కథానాయకుడు సుమంత్ త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారని ఇటీవలే సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. పవిత్ర అనే అమ్మాయిని ఆయన పెళ్లాడనున్నట్లు.. ఓ పెళ్లి పత్రిక వైరల్‌గా మారింది. దీనిపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వ్యంగ్యంగా స్పందించగా.. దీనికి సమాధానంగా సుమంత్ ఓ వీడియో ట్వీట్ చేశారు.
-
🙏🏼 Just clearing the air, for those who are interested, and for dear @RGVzoomin who has such immense concern for me 😊 https://t.co/ROrftZaadc pic.twitter.com/TS72kbdNA8
— Sumanth (@iSumanth) July 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">🙏🏼 Just clearing the air, for those who are interested, and for dear @RGVzoomin who has such immense concern for me 😊 https://t.co/ROrftZaadc pic.twitter.com/TS72kbdNA8
— Sumanth (@iSumanth) July 29, 2021🙏🏼 Just clearing the air, for those who are interested, and for dear @RGVzoomin who has such immense concern for me 😊 https://t.co/ROrftZaadc pic.twitter.com/TS72kbdNA8
— Sumanth (@iSumanth) July 29, 2021
"అందరికీ నమస్తే.. ఈ మధ్య నేను మళ్లీ పెళ్లి చేసుకుంటానని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ అందరికీ స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. నిజ జీవితంలో నేను పెళ్లి చేసుకోవడం లేదు. విడాకులు తీసుకోవడం.. ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవడం నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాను. అలాంటి కథతో ఓ సినిమా రావడం తెలుగులో ఇదే తొలిసారి. సినిమా చిత్రీకరణ సందర్భంగా ఆ సినిమాలోని ఓ వెడ్డింగ్ కార్డు బయటికి వచ్చింది. అదే అపార్థాలకు దారి తీసింది."
- సుమంత్, కథానాయకుడు
సుమంత్‌కు హీరోయిన్ కీర్తిరెడ్డితో గతంలోనే వివాహమైంది. మనస్పర్థలు తలెత్తడం వల్ల పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని తమ బంధానికి స్వస్తి పలికారు.
'ప్రేమకథ'తో వెండితెరకు పరిచయమైన సుమంత్ .. 'స్నేహమంటే ఇదేరా', 'సత్యం', 'గోదావరి', 'గోల్కొండ హైస్కూల్' చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస పరాజయాల అనంతరం 'మళ్లీరావా' సినిమాతో పాజిటివ్ టాక్ అందుకున్నారు. ఇటీవల వచ్చిన 'కపటధారి' మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా 'అనగనగా ఒక రౌడీ' చేస్తున్నారు.
ఇదీ చూడండి.. Sumanth Marriage: హీరో సుమంత్‌కు మళ్లీ పెళ్లి