ETV Bharat / sitara

శింబు గొప్ప మనసు.. కానుకలతో సిబ్బందికి సర్​ప్రైజ్​

తన సినిమాలో పని చేసిన సిబ్బందిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు తమిళ హీరో శింబు. దీపావళి కానుకగా అందరికీ.. బంగారు నాణెం, కొత్తబట్టలు అందజేశాడు.

Hero Simbhu gifts gold coins and clothes to his film crew members
శింబు గొప్ప మనసు.. కానుకలతో సిబ్బందికి సర్​ప్రైజ్​
author img

By

Published : Nov 8, 2020, 8:18 AM IST

తమిళ హీరో శింబు తన కొత్త సినిమా 'ఈశ్వరన్' సిబ్బందికి పెద్ద సర్​ప్రైజ్​ ఇచ్చాడు. దీపావళి బహుమతి కింద ఈ సినిమాలో పనిచేసిన వారందరికీ ఒక గ్రాము బంగారు నాణెం, కొత్త బట్టలను బహుమతిగా అందించాడు. అయితే.. కోలీవుడ్​లో ఈ సంప్రదాయం.. ప్రముఖ నటుడు శివాజీ గణేశన్​తో ప్రారంభమైంది. ఆ తర్వాత రజినీకాంత్, విజయ్​ వంటి హీరోలు కొనసాగిస్తూ వచ్చారు. తాజాగా శింబు.. వాళ్ల సరసన చేరిపోయాడు. ​

Hero Simbhu gifts gold coins and clothes to his film crew members
ఈశ్వరుడు పోస్టర్​

ఈశ్వరన్​ చిత్రంలో నటించిన 200 మంది జూనియర్​ ఆర్టిస్ట్​లకు కూడా శింబు కొత్త బట్టలు అందజేసి, సంతోషంలో ముంచెత్తాడు. షూటింగ్​ చివరి రోజు ఈ కానుకలను వారికి పంపిణీ చేశాడు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈశ్వరన్ సినిమాను​ తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. రానున్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో ఈశ్వరుడు పేరుతో విడుదల కానుంది.

ఇదీ చూడండి:మూడేళ్ల తర్వాత హీరో శింబు ఎంట్రీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.