కొంతకాలంగా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్న హీరో రానా.. మళ్లీ అభిమానులను పలకరించాడు. ఈరోజు (ఆదివారం) ఉదయం ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశాడు. చాలా రోజుల తర్వాత భారత్కు వచ్చినందుకు ఆనందంగా ఉందన్నాడు. అయితే ఇటీవలే అతడి ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అభిమానుల్ని కలవరపెడుతున్నాయి.
దాదాపు రెండు నెలలు అమెరికాలో ఉన్నాడు రానా. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ బిజిగా ఉన్నాడు. తెలుగులో 'విరాట పర్వం' షూటింగ్ దశలో ఉంది. సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. హిందీలో అక్షయ్ కుమార్తో చేసిన 'హౌస్ ఫుల్ 4' దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చూడండి.. నితిన్ కోసం ముగ్గురు హీరోయిన్లు.. ఆసక్తికర టైటిల్