ETV Bharat / sitara

ఆ రికార్డు కొట్టిన తొలి దక్షిణాది హీరో రామ్ - డబ్బింగ్ సినిమాలతో రామ్ రికార్డు

డబ్బింగ్ సినిమాలతో యూట్యూబ్​లో రికార్డులు సృష్టిస్తున్నాడు యువ కథానాయకుడు రామ్​ పోతినేని. ప్రస్తుతం ఓ సరికొత్త ఘనతను సాధించిన తొలి దక్షిణాది హీరోగా నిలిచాడు.

ఆ రికార్డు కొట్టిన తొలి దక్షిణాది హీరో రామ్
హీరో రామ్
author img

By

Published : Apr 29, 2020, 4:23 PM IST

సినిమాలకు కలెక్షన్లతో పాటు యూట్యూబ్​లో లైక్​లు, వ్యూస్​కు సంబంధించిన​ ట్రెండ్ నడుస్తున్న కాలమిది. అందుకు తగ్గట్లుగానే కొన్ని చిత్రాలు వీక్షణల్లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ అరుదైన రికార్డును కొల్లగొట్టాడు టాలీవుడ్ హీరో రామ్. తన గత నాలుగు సినిమాలను హిందీలో డబ్ చేసి, యూట్యూబ్​లో విడుదల చేయగా అవన్నీ 100 మిలియన్లకు పైగా వ్యూస్​ సాధించాయి. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది కథానాయకుడు ఇతడే కావడం విశేషం. ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్.. సోషల్ మీడియాలో పంచుకుంది.

ram last four movies which got 100 millions views
100 మిలియన్లు వ్యూస్​ దాటిన రామ్ గత నాలుగు డబ్బింగ్ సినిమాలు

గతేడాది వచ్చిన రామ్ 'ఇస్మార్ట్ శంకర్' డబ్బింగ్ వెర్షన్.. యూట్యూబ్​లో తాజాగా 100 మిలియన్ల వ్యూస్​ మార్క్​ను అందుకుంది. అంతకు ముందు 'ద సూపర్​ కిలాడీ-3' (నేను శైలజ)-189+ మిలియన్ వ్యూస్, 'దమ్​దర్ కిలాడీ' (హలోగురు ప్రేమకోసమే)-184+ మిలియన్ వ్యూస్, 'నంబర్.1 దిల్​వాలా' (ఉన్నది ఒకటే జిందగీ)- 157+ మిలియన్ వ్యూస్​ సాధించాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.