ETV Bharat / sitara

వాటిని పట్టించుకోను.. నా దృష్టిలో సినిమా అంటే అదే: తారక్​ - rajamouli RRR movie

NTR about RRR movie: తన దృష్టిలో సినిమాల గురించి మాట్లాడాలంటే మొదట ప్రశంసలు, ఆ తర్వాత రివ్యూలు, చివరిగా బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ అని అన్నారు హీరో ఎన్టీఆర్​. తనకు ఆ కలెక్షన్స్​తో ఎలాంటి సంబంధం ఉండదని చెప్పారు.

RRR ntr
ఆర్​ఆర్​ఆర్​ ఎన్టీఆర్​
author img

By

Published : Mar 30, 2022, 3:39 PM IST

NTR about RRR movie: ఇకపై తన కెరీర్‌ గురించి చెప్పుకొంటే.. 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు ముందు, తర్వాత అని అందరూ మాట్లాడుకుంటారని హీరో ఎన్టీఆర్​ అన్నారు. తన కెరీర్‌లోనే ఈ చిత్రం ఎంతో ప్రత్యేకం అని చెప్పారు. "ఈ సినిమాలో నా పరిచయ సన్నివేశాలు ఎంతో ప్రత్యేకంగా ఉన్నాయని అందరూ చెబుతున్నారు. నాకిది ఓ ప్రత్యేకమైన చిత్రం. ఇకపై నా కెరీర్‌ గురించి మాట్లాడాలంటే.. అందరూ 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు ముందు, ఆ తర్వాత అని చెప్పుకొంటారు. నటుడిగా ఇప్పటివరకూ చేసిన దానికంటే ఈ సినిమా నా నుంచి ఎంతో శ్రమ కోరుకుంది. నాకొక కొత్త ఆరంభాన్ని అందించింది. ఇందులో పని చేసినందుకు గర్వపడుతున్నాను" అని ఎన్టీఆర్​ అన్నారు.

"సాధారణంగా హీరో ఇంట్రో సీన్‌ వచ్చినప్పుడు ఫ్యాన్స్‌ చప్పట్లు కొడతారు.. ఈలలు వేస్తారు.. కొంతసమయానికి సినిమాలో లీనమైపోతారు. కానీ, ఈ సినిమాలో నా పరిచయ సన్నివేశాలు చూస్తే 'భీమ్‌' గురించి ఒక పూర్తి అవగాహన వచ్చేలా దర్శకుడు ఆ షాట్స్‌ తీర్చిదిద్దారు. దర్శకుల పాయింట్ ఆఫ్‌ వ్యూలో ఇదొక గొప్ప పరిచయ సన్నివేశం. అలాగే ఇందులోని చాలా సన్నివేశాలను ప్రేక్షకులు ఫోన్లలలో రికార్డ్‌ చేసి యూట్యూబ్‌లో షేర్‌ చేస్తున్నారు. ప్రేక్షకుల ఎంజాయ్‌మెంట్‌ వీడియోలు చూసి నేనూ ఆనందించా. ఇంతమంది ఆడియన్స్‌ పల్స్‌ని రాజమౌళి ఎలా పట్టుకున్నారు? అని ఆలోచించా. నా దృష్టిలో సినిమాల గురించి మాట్లాడాలంటే మొదట ప్రశంసలు, ఆ తర్వాత రివ్యూలు, చివరిగా నంబర్స్‌(బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌). ఎందుకంటే నంబర్స్‌తో నాకు ఎలాంటి సంబంధం ఉండదు. అయితే.. నంబర్స్‌ పెరిగితే.. నటీనటులకు మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది" అని తారక్​ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.